AFMS Jobs: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 420 ఆఫీసర్ పోస్టులు
ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్) షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్ డిగ్రీ, పీజీ మెడికల్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులకు మొదటగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.
వివరాలు:
మెడికల్ ఆఫీసర్: 420 పోస్టులు
పోస్టుల కేటాయింపు: పురుషులు-378, మహిళలు-42.
అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్/ నేషనల్ మెడికల్ కమిషన్/ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో శాశ్వత సభ్యత్వం ఉండాలి. అభ్యర్థులు 31.08.2022 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి/పూర్తవుతూ ఉండాలి.
Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
వయోపరిమితి: 31.12.2022 నాటికి ఎంబీబీఎస్ డిగ్రీ అభ్యర్థులు 30 సంవత్సరాలు (02.01.1993 తర్వాత జన్మించి ఉండాలి), పీజీ డిగ్రీ అభ్యర్థులు 35 సంవత్సరాలు (02.01.1988 తర్వాత జన్మించి ఉండాలి) మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.200. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2022.
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ: 27.09.2022.
వేదిక: ARMY HOSPITAL (R&R), DELHI CANTT.
Also Read:
SSC Stenographer Exam: ఇంటర్ అర్హతతో 'స్టెనోగ్రాఫర్' ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
Also Read:
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, సబ్-ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు సెప్టెంబరు 12 చివరితేదీగా నిర్ణయించారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...