అన్వేషించండి

NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. వివరాలు ఇవే..

NTPC Recruitment 2021 For 22 posts: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 22 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది.

NTPC Executive Jobs: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ).. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

పోస్టులను బట్టి విద్యార్హత మారుతోంది. బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా కేటగిరీల వారు రూ.300 ఫీజు చెల్లించాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సహా మరిన్ని వివరాల కోసం http://ntpc.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 
పోస్టుల వివరాలు.. 
మొత్తం పోస్టులు: 22
ఎగ్జిక్యూటివ్‌ (కమర్షియల్‌): ఇందులో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వయోపరిమితి 35 ఏళ్లుగా ఉంది. సంబంధిత రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. 
ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెన్సీ): ఇందులో ఓ అండ్ ఎమ్ విభాగంలో ఒక పోస్టు, ఇంజనీరింగ్ విభాగంలో ఒకటి, ప్రాజెక్టు మానిటరింగ్ విభాగంలో ఒక పోస్టు ఉన్నాయి. దీనికి వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్దేశించారు. సంబంధిత రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.  
ఎగ్జిక్యూటివ్‌ (బిజినెస్‌ అనలిస్ట్‌): ఇందులో ఒక పోస్టు ఉంది. వయో పరిమితి 40 ఏళ్లుగా నిర్దేశించారు. సంబంధిత రంగంలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.  
సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోలార్‌): ఇందులో కూడా ఒక్క పోస్టు ఉంది. 10 ఏళ్ల అనుభవం (ఇందులో 4 ఏళ్లు సంబంధిత విభాగంలోనే ఉండటం తప్పనిసరి) అవసరం. వయోపరిమితి 56 ఏళ్లుగా ఉంది. 
సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (కంపెనీ సెక్రటరీ): ఇందులో ఒక్క పోస్టు ఉంది. సంబంధిత విభాగంలో కనీసం 20 ఏళ్లు అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి 56 ఏళ్లుగా ఉంది. 
సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌): ఒక పోస్టు ఉంది. సంబంధిత విభాగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. గరిష్ట వయో పరిమితి 56 ఏళ్లు. 
ఎగ్జిక్యూటివ్‌ (క్లీన్‌ టెక్నాలజీస్‌): ఈ విభాగంలోనూ 1 పోస్టు ఉంది. కనీసం 5 ఏళ్లు (ఇందులో కనీసం 3 ఏళ్లు సంబంధిత విభాగంలో అవసరం) అనుభవం తప్పనిసరి. గరిష్ట వయో పరిమితి 56 ఏళ్లుగా ఉంది. 
గమనిక: రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. 

నేవీ ఉద్యోగాలకు ముగియనున్న దరఖాస్తు గడువు.. 
ఇండియన్ నేవీ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన వారి కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 30వ తేదీతో ముగియనుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 40 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు

టాప్ హెడ్ లైన్స్

TG Police Jobs: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు
SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ. 92,000 పైగా జీతం
SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Telangana Police Recruitment: గుడ్‌న్యూస్.. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
గుడ్‌న్యూస్.. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Epic Twitter Review - ఎపిక్ ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్... పొగడ్తలూ & విమర్శలూ - 'బేబీ' జంట కొత్త సినిమా ఎలా ఉందంటే?
ఎపిక్ ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్... పొగడ్తలూ & విమర్శలూ - 'బేబీ' జంట కొత్త సినిమా ఎలా ఉందంటే?
BRS MLCs Bail Cancellation: BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
Vijay Vs Stalin: తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ సైగ’ మంటలు.. సీఎం విజయ్ వర్సెస్ ఎంకే స్టాలిన్!
తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ సైగ’ మంటలు.. సీఎం విజయ్ వర్సెస్ ఎంకే స్టాలిన్!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
Trump Dividend: డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
Botsa Satyanarayana Cry: చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
Future City Land Allegations: అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
Embed widget