NRSC: ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు, వివరాలు ఇలా
NRSC Recruitment: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు.
NRSC Recruitment: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 41
1) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(అగ్రికల్చర్): 02 పోస్టులు
అర్హత: ఎంఈ/ ఎంటెక్(రిమోట్ సెన్సింగ్) మరియు జీఐఎస్/జియోఇన్ఫర్మేటిక్స్ లేదా తత్సమానంతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్(4 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-30 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
2) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(ఫారెస్ట్రీ & ఎకాలజీ): 04 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ(బోటనీ / ఫారెస్ట్రీ) లేదాతత్సమానంతో పాటు బీఎస్సీ(వృక్షశాస్త్రం / ఫారెస్ట్రీ / ఎకాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-28 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
3) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(జియో ఇన్ఫర్మేటిక్): 02 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ(జియోఇన్ఫర్మేటిక్స్) లేదా తత్సమానంతో పాటు బీఎస్సీ(ఫిజిక్స్/ మ్యాథ్స్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-28 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
4) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(జియో ఇన్ఫర్మేటిక్): 05 పోస్టులు
అర్హత: ఎంఈ/ఎంటెక్(రిమోట్ సెన్సింగ్ మరియు జీఐఎస్/జియోఇన్ఫర్మేటిక్స్ /ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) లేదా తత్సమానంతో పాటు బీఈ/ బీటెక్(కంప్యూటర్ సైన్స్ / జియోఇన్ఫర్మేటిక్స్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-30 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
5) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(జీయాలజీ): 04 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ(జియాలజీ / అప్లైడ్ జియాలజీ) లేదా తత్సమానంతో పాటు బీఎస్సీ(జియాలజీ / అప్లైడ్ జియాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-28 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
6) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(జియో ఫిజిక్స్): 04 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)(జియోఫిజిక్స్) లేదా తత్సమానంతో పాటు బీఎస్సీ(ఫిజిక్స్ / మ్యాథ్స్ / జియాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-28 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
7) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(సాయిల్ సైన్స్): 04 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ(సాయిల్ సైన్స్ & అగ్రికల్చర్ కెమిస్ట్రీ) లేదా తత్సమానంతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్(4 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-28 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
8) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(అర్బన్ స్టడీస్) 03 పోస్టులు
అర్హత: ఎంఈ/ఎంటెక్(అర్బన్ ప్లానింగ్ / రీజినల్ ప్లానింగ్) లేదా తత్సమానంతో పాటు బీఈ/ బీటెక్(ప్లానింగ్) లేదా బీఆర్క్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-30 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
9) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(వాటర్ రీసోర్సెస్): 03 పోస్టులు
అర్హత: ఎంఈ/ఎంటెక్(సివిల్ ఇంజినీరింగ్(స్పెషలైజేషన్‌తో వాటర్ రిసోర్సెస్/హైడ్రాలజీ/ సాయిల్ & వాటర్ కన్సర్వేషన్) లేదా అగ్రికల్చర్ ఇంజినీరింగ్(స్పెషలైజేషన్‌తో వాటర్ రిసోర్సెస్/హైడ్రాలజీ/ సాయిల్ & వాటర్ కన్సర్వేషన్) లేదా వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్(స్పెషలైజేషన్‌తో వాటర్ రిసోర్సెస్/హైడ్రాలజీ/ సాయిల్ & వాటర్ కన్సర్వేషన్)తో పాటు బీఈ/ బీటెక్(సివిల్ ఇంజినీరింగ్ / అగ్రికల్చర్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-30 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
10) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(వాటర్ రీసోర్సెస్): 01 పోస్టులు
అర్హత: ఎంఈ/ఎంటెక్(సివిల్ ఇంజినీరింగ్(స్పెషలైజేషన్‌తో వాటర్ రిసోర్సెస్/హైడ్రాలజీ/ సాయిల్ & వాటర్ కన్సర్వేషన్) లేదా అగ్రికల్చర్ ఇంజినీరింగ్(స్పెషలైజేషన్‌తో వాటర్ రిసోర్సెస్/హైడ్రాలజీ/ సాయిల్ & వాటర్ కన్సర్వేషన్) లేదా వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్(స్పెషలైజేషన్‌తో వాటర్ రిసోర్సెస్/హైడ్రాలజీ/ సాయిల్ & వాటర్ కన్సర్వేషన్)తో పాటు బీఈ/ బీటెక్(సివిల్ ఇంజినీరింగ్ / అగ్రికల్చర్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-30 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
11) సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(వాటర్ రీసోర్సెస్): 03 పోస్టులు
అర్హత: ఎంఈ/ఎంటెక్(రిమోట్ సెన్సింగ్ మరియు జీఐఎస్/ జియోఇన్ఫర్మేటిక్స్) లేదా తత్సమానంతో పాటు బీఈ/ బీటెక్(సివిల్ ఇంజినీరింగ్ / అగ్రికల్చర్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 12.02.2024 నాటికి 18-30 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
12) మెడికల్ ఆఫిసర్ 'ఎస్సీ' : 01 పోస్టు
అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
వయోపరిమితి: 18 - 35 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ. 81,906.
13) నర్స్ 'బీ': 02 పోస్టులు
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ, ఫస్ట్ క్లాస్ మూడేళ్ల డిప్లొమా, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలతో గుర్తింపు పొందిన జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీని కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 35 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ.65,554.
14) లైబ్రరీ అసిస్టెంట్ 'ఏ': 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్) లేదా తత్సమానం కలిగి ఉండాలి.
సంబంధిత పోస్టును అనుసరించి తదితర విభాగాల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఎంఎస్సీ,ఎంటెక్, ఎంఈ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 18 - 35 సంవత్సరాలు మించరాదు.
జీతం: నెలకు రూ.65,554.
దరఖాస్తు ఫీజు: రూ.750
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.02.2024.