By: ABP Desam | Updated at : 29 Sep 2023 11:38 AM (IST)
Edited By: omeprakash
నిట్ వరంగల్ ఉద్యోగ నియామకాలు
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో బోధనేతర పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 129 పోస్టుల నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు పొందిన ఓ వ్యక్తి ద్వారా ఈ విషయాలు బయటికొచ్చాయి. నిట్ పరిధిలో అసిస్టెంట్ రిజిస్ట్రార్; సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి 2021లో నోటిఫికేషన్ వెలువడింది. 2022 ఫిబ్రవరిలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు.
నిట్ అభ్యర్థులకు ఇచ్చిన కాల్‌లెటర్‌లలో అభ్యర్థి పేరు, ఫొటో లేకపోవడం గమనార్హం. ఎంపికైనవారి జాబితాలోనూ మార్పుచేర్పులు జరిగినట్టు తెలిసింది. జూనియర్ సహాయకుల పోస్టులకు ఎంపికైనవారి జాబితాలో ఓ క్రమసంఖ్యలో ఒక అభ్యర్థి పేరు ఉండగా, కొన్నాళ్ల తర్వాత నిట్ అధికారిక వెబ్‌సైట్లో మరో వ్యక్తి పేరు ఉందని ఆర్‌టీఐ కింద సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో పలువురికి కనీస నైపుణ్యాలు లేకపోవడంతో ఈ ఏడాది జనవరిలో తొలగించారు. ఇలా తొలగించిన వారిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉన్నారు.
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో ఇటీవల భర్తీ చేసిన 23 గ్రూప్-డి నియామకాలను రద్దు చేశారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఇవ్వలేదని, కనీసం పత్రిక ప్రకటనలు కూడా ఇవ్వకుండా భర్తీ చేయడం చెల్లదని 62వ నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించారు. మిషన్ మోడ్ కింద 23 మంది దినసరి వేతన ఉద్యోగుల పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరించడంతో వాటిని రద్దు చేయాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
నిట్‌లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి 2021లో నోటిఫికేషన్ లేకుండానే నియామక పరీక్ష జరిగింది. ఎంపికైన వారికి 'పీఎం రోజ్‌గార్ మేళా' మిషన్ మోడ్‌లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా ఇటీవల నియామక ఉత్తర్వులు ఇప్పించారు. అయితే వీరికి వయో పరిమితిలో మాత్రమే మినహాయింపు ఇచ్చేందుకు అవకాశముంది. వీరికి సెప్టెంబరు 26న నియామక రద్దు పత్రాలను అందజేశారు. పరీక్షలో అర్హత సాధించకుండా రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించేందుకు వీల్లేదు. ఈ 23 గ్రూప్-డి పోస్టుల తరహాలోనే గతంలో 9 ఖాళీలను నిట్ యాజమాన్యం భర్తీచేసింది. అవన్నీ కూడా గ్రూప్-4 కేడర్ పోస్టులే. ఈ 23 మంది ఎన్నో ఏళ్లుగా దినసరి వేతనంతో పనిచేస్తున్నారని, మానవతా దృక్పథంతో వారిని క్రమబద్ధీకరించాలనుకున్నామని ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. ఇకపై వారు దినసరి వేతనంపైనే కొనసాగుతారని పేర్కొన్నారు. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించినందువల్ల 129 పోస్టుల భర్తీ గురించి తెలియదని స్పష్టం చేశారు.
ALSO READ:
వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్- వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్-కళ్యాణిలో 120 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్, డిగ్రీ అర్హతతో 444 ఉద్యోగాల భర్తీ
UCO Bank Notification: యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా
Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
/body>