అన్వేషించండి

Nellore News : నెల్లూరులో భవిష్యత్ అగ్నివీర్ లు, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన

నెల్లూరులో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ తొలిరోజే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 12 రోజులపాటు నెల్లూరులో ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగుతుంది. 

అగ్నిపథ్ అమలులోకి వచ్చాక ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలకు ఎలాంటి స్పందన వస్తుందోననే అనుమానాలు అందరిలో ఉన్నాయి. అయితే అలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆర్మీకి ఎంపికవ్వాలనుకుంటున్న అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ర్యాలీకి పోటెత్తారు. నెల్లూరులో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ తొలిరోజే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 12 రోజులపాటు నెల్లూరులో ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగుతుంది. 

Nellore News : నెల్లూరులో భవిష్యత్ అగ్నివీర్ లు, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన

అగ్నిపథ్ పథకం అమలులోకి రావడంతో ఇప్పుడు అగ్నివీర్ లు గా విధులు నిర్వర్తించేవారికోసం సైన్యం రిక్రూట్ మెంట్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అగ్నివీర్ లకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 26 వరకు అగ్నివీర్ ల ఎంపిక జరుగుతుందని అధికారులు తెలిపారు. 

Nellore News : నెల్లూరులో భవిష్యత్ అగ్నివీర్ లు, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన

ఎవరెవరు..?
దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ లోని అభ్యర్థులంతా నెల్లూరులో జరిగే ర్యాలీకి హాజరు కావాల్సి ఉంటుంది. రాయలసీమ జిల్లాలు, గుంటూరు జోన్‌ ప్రాంతంలోని అభ్యర్థులు ఇక్కడికి వస్తున్నారు. 34వేల మందికిపైగా అభ్యర్థులు అగ్నివీర్ ఉద్యోగాలకోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 970 మంది నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు బుధవారం సాయంత్రమే నగరానికి చేరుకున్నారు. 

Nellore News : నెల్లూరులో భవిష్యత్ అగ్నివీర్ లు, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన

పన్నెండేళ్ల తర్వాత.. 
పన్నెండేళ్ల తర్వాత నెల్లూరు జిల్లాలో ఆర్మీ ర్యాలీ జరుగుతోంది. దీనికోసం అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ర్యాలీలో భాగంగా రన్నింగ్ రేస్ జరిగే సమయంలో నగరవాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు అధికారులు. నెల్లూరులో జరుగుతున్న ఈ ర్యాలీ ద్వారా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌ మెన్‌ (టెన్త్ పాస్ అయినవారు) అగ్నివీర్‌ ట్రేడ్‌మెన్‌(ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైనవారు) ని ఎంపిక చేస్తారు. 

Nellore News : నెల్లూరులో భవిష్యత్ అగ్నివీర్ లు, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన

రోజుకి 3వేలమంది.. 
రిక్రూట్ మెంట్ ర్యాలీకి వచ్చిన అభ్యర్థులను ముందుగా నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణకు చేరుకుంటున్నారు. అక్కడ హాజరు తీసుకుని వారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఆ తర్వాత హైట్ పరిశీలిస్తారు. హైట్ లో రిజెక్ట్ అయితే వెంటనే వెనక్కి పంపిస్తారు. హేట్ సెలక్ట్ అయినవారిని మాత్రమే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోకి పంపిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనకోసం ఆసుపత్రి ఆవరణలో మొత్తం 10 కంపార్ట్‌ మెంట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో దానిలో 300 మందికి ప్రవేశం ఉంది. ఇలా రోజుకి 3వేలమందికి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ముందు వచ్చినవారికి ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. ఆన్ లైన్లో అడ్మిట్ కార్డ్ లు డౌన్ లోడ్ చేసుకుని రిక్రూట్ మెంట్ ర్యాలీకి రావాల్సి ఉంటుంది. 

గడ్డం ఉండకూడదు.. 
ఆర్మీ ఎంపికకు వచ్చే అభ్యర్థులను తమ సోదరులు, పిల్లలుగా భావించాలని అధికారులకు సూచించారు గుంటూరు రేంజ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసర్ కల్నల్‌ కోహ్లి. ప్రతిభ ఆధారంగానే పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయన్నారు. ఎ1వరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అభ్యర్థులు తమ వెంట సెల్‌ ఫోన్లు తీసుకురాకూడదన్నారు. గడ్డం ఉంటే అనుమతించబోమని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget