Meta: ఉద్యోగులకు మెటా స్ట్రాంగ్ వార్నింగ్, ఆఫీస్‌కు రావాల్సిందే!
ఫేస్‌బుక్ మాతృ సంస్థ ‘మెటా’ తన ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకుంటే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఫేస్‌బుక్ మాతృ సంస్థ ‘మెటా’ తన ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకుంటే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని స్పష్టంచేసింది. ఈ మేరకు మెటా మానవ వనరుల అధిపతి లోరీ గోలెర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. సంస్థ లక్ష్యం ఉద్యోగుల మధ్య మంచి అనుబంధం, బలమైన టీమ్ వర్క్‌ను ప్రోత్సహించడమే అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు సంస్థ సూచనలను పాటిస్తున్నారా..? లేదా..? అన్నది మేనేజర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు.
కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 'వర్క్ ఫ్రమ్ హోం' విధానాన్ని అమలుచేశాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు లేనప్పటికీ చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చిన పని చేసేందుకు సుముఖంగాలేరు. కొన్ని కంపెనీలు వారంలో మూడు రోజులైనా తప్పనిసరిగా ఆఫీస్ నుంచే వర్క్ చేయాలని కోరుతున్నాయి.దీన్ని చాలా మంది ఉద్యోగులు పట్టించుకోవడంలేదు. దీంతో ఉద్యోగులను తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచే పని చేయాలని మెటా సంస్థ ఉద్యోగులను ఆదేశించింది.
బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 5 నుంచి కార్యాలయాలకు కేటాయించిన ఉద్యోగులు వారానికి మూడు రోజులు కచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 5 నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు పంపించిన నోటీస్‌లు స్పష్టం చేసింది. ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నదీ, లేనిదీ తనిఖీ చేయాలని మేనేజర్లను కోరింది. ఆఫీస్‌ల నుంచి పని చేయడం వల్ల ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని, టీమ్ వర్క్‌కు ఈ నిర్ణయం దోహదపడుతుందని మెటా తెలిపింది. ఆఫీస్‌కు రావాలన్న నిబంధన నుంచి రిమోట్ ఉద్యోగులను మినహాయించింది. ఆఫీస్ నుంచి పని చేస్తేనే మంచి ఫలితాలు సాధించగలమని, ఇంట్లో ఉంటూ వర్క్ చేసే వారి కంటే ఆఫీస్‌లో పని చేసే వారే మంచి ఫలితాలు సాధిస్తున్నారని గతంలో ఒకసారి జుకర్‌బర్గ్ ఉద్యోగులతో చెప్పారు.
చాలా కంపెనీలు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయాలకు రావాల్సిని కోరుతున్నాయి. ప్రధానంగా టీమ్ వర్క్ మెరుగుపడేందుకు ఇది ఉపయోపగపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఇండియాలో చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్ నుంచే వర్క్ చేయాలని గతంలోనే ఆదేశించాయి. మన దగ్గర కూడా కొన్ని కంపెనీలు వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి వర్క్ చేసేందుకు అనుమతి ఇస్తున్నాయి. తరచూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. ఇందులో ఉద్యోగుల పనితీరు రేటింగ్‌ను తగ్గించడం, సమస్య అలాగే కొనసాగితే ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ALSO READ:
'గేట్-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఈసారి కొత్త పేపరు జోడింపు!
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది. గేట్-2024 పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐఎస్సీ-బెంగళూరు షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..