అన్వేషించండి

KVS Recruitment: 13,404 కేంద్ర కొలువుల దరఖాస్తుకు నేడే ఆఖరు, దరఖాస్తు చేసుకోండి!

కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 పోస్టులను భర్తీకి సంబంధించి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 2తో దరఖాస్తు గడువు ముగియనుంది. 

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటితో (జనవరి 2) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు ప్రక్రియను పొడిగించిన సంగతి తెలిసిందే. మరోసారి పొడిగింపు ఉండకపోవచ్చు. కాబట్టి ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 2తో దరఖాస్తు గడువు ముగియనుంది. వాస్తవానికి డిసెంబరు 26నే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం వారంపాటు (జనవరి 2 వరకు) పొడిగించారు.

పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ డిప్లొమా/బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్‌సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్నవారికి వయోపరిమితి విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు.

Online Application

దరఖాస్తు ఫీజు..
అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రిన్సిపల్‌, వైస్‌-ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.2300లు, పీఆర్టీ/టీజీటీ/పీజీటీ/ఫైనాన్స్‌ ఆఫీసర్‌/ఏఈ/లైబ్రేరియన్‌/ఏఎస్‌ఓ/హెచ్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. 

పోస్టుల వివరాలు..

6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

1) అసిస్టెంట్ కమిషనర్: 52 పోస్టులు

2) ప్రిన్సిపాల్: 239 పోస్టులు

3) వైస్ ప్రిన్సిపాల్: 203 పోస్టుల

4) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 1409 పోస్టులు

5) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 3176 పోస్టులు

6) లైబ్రేరియన్: 355 పోస్టులు

7) ప్రైమరీ టీచర్ (మ్యూజిక్): 303 పోస్టులు

8) ఫైనాన్స్ ఆఫీసర్: 06 పోస్టులు

9) అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): 02 పోస్టులు

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో): 156 పోస్టులు

11)  హిందీ ట్రాన్స్‌లేటర్ (హెచ్‌టీ): 11 పోస్టులు

12) సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ-యూడీసీ): 322 పోస్టులు

13) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్ఏ-ఎల్‌డీసీ): 702 పోస్టులు

14) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 54 పోస్టులు

6414 ప్రైమరీ టీచర్ పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్-2599 పోస్టులు, ఓబీసీ-1731 పోస్టులు, ఈబ్ల్యూఎస్-641 పోస్టులు, ఎస్సీ-962 పోస్టులు, ఎస్టీ-481 పోస్టులు.

అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్). (లేదా) సీనియర్ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనలప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

జీత భత్యాలు: రూ.35,400-రూ.1,12,400.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022. (జనవరి 2 వరకు పొడిగించారు)

➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.

6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 


WEBSITE 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget