Jobs Alert: లేఆఫ్స్ సమయంలో శుభవార్త! వచ్చే 10 ఏళ్లలో ఈ రంగంలో 9 కోట్ల కొత్త ఉద్యోగాలు
Layoffs Jobs 2025 | ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత నడుస్తుండగా, అంతర్జాతీయ ప్రయాణ మరియు పర్యాటక రంగంలో 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

WTTC Report 2025 on Jobs: ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ (AI), కొత్త సాంకేతిక పరిజ్ఞానం రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతున్నాయి. ఏ రంగంలో ఉద్యోగాలు పోతాయో అని ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల లేఆఫ్స్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఒక బిగ్ గుడ్ న్యూస్ వచ్చింది. అంతర్జాతీయ ప్రయాణం, పర్యాటక రంగంలో రాబోయే 10 సంవత్సరాలలో 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (WTTC) నివేదిక ప్రకారం.. ట్రావెల్, పర్యాటక రంగంలో రాబోయే రోజుల్లో కొత్త ఉద్యోగాల అవకాశాలు వస్తాయి.
నివేదిక ఏం చెబుతోంది?
ఫ్యూచర్ ఆఫ్ ది ట్రావెల్ అండ్ టూరిజం వర్క్‌ఫోర్స్ పేరుతో విడుదలైన నివేదికలో జనాభా పెరుగుదల, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలి. లేకపోతే ట్రావెల్, టూరిజం రంగంలో 4.3 కోట్లకు పైగా ఉద్యోగుల కొరత ఏర్పడే అవకాశముంది. ఈ లోటును భర్తీ చేయడానికి కొత్త వర్క్‌ఫోర్స్ అవసరం, కనుక కోట్ల సంఖ్యలో కొత్త ఉద్యోగాల అవకాశాలు ఏర్పడతాయి. ఈ నివేదిక ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
నివేదిక ప్రకారం, 2035 నాటికి ట్రావెల్, టూరిజం రంగంలో పనిచేసే వ్యక్తుల అవసరాలు, డిమాండ్ మధ్య దాదాపు 4.3 కోట్ల మంది వ్యత్యాసం ఉండవచ్చు, అంటే ఎంతమంది వ్యక్తులు అవసరమో, అంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఈ రంగంలో అందుబాటులో ఉండరు. పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం నేరుగా పడుతుంది. నివేదిక ప్రకారం.. చైనా, భారతదేశం, యూరోపియన్ యూనియన్‌లో ఈ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు యూరప్ దేశాల GDPలో ఎక్కువ భాగం పర్యాటకం నుంచే వస్తుందని తెలిసిందే. నేటికీ ప్రపంచ పర్యాటక రంగంలో యూరప్ అగ్రస్థానంలో ఉంది.
వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (WTTC)
WTTC అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్, టూరిజం రంగానికి సంబంధించిన విధానాలు, వాటి ఆర్థిక, సామాజిక అంశాలపై పనిచేసే ఒక సంస్థ. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలతో కలిసి ట్రావెల్, టూరిజం గురించి అవగాహన కల్పిస్తుంది.
కొత్త ఉద్యోగాలకు అవకాశం
పలు రంగాలలో కొత్త టెక్నాలజీ ద్వారా జాబ్స్ పోతున్నాయి. కానీ ట్రావెల్, పర్యాటక రంగాల్లో వర్క్‌ఫోర్స్‌లో లోటు ఏర్పడుతుంది. కనుక ఈ రంగాల్లో వచ్చే పదేళ్లలో కోట్లాది కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ (ఉద్యోగులు) కావాలి. కనుక యువత ఈ రంగానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటే, భవిష్యత్తులో వారికి ట్రావెట్, టూరిజం రంగాల్లో కొత్త ఉపాధి మార్గాలు తెరుచుకుంటాయి.






















