ISRO Exam: 'ఇస్రో' నియామక రాతపరీక్ష రద్దు, హరియాణాకు చెందిన ఇద్దరు అరెస్ట్
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ఆధ్వర్యంలోని చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)లో టెక్నికల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 20న నిర్వహించిన రాతపరీక్షను రద్దుచేశారు.
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ఆధ్వర్యంలోని చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)లో టెక్నికల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 20న నిర్వహించిన రాతపరీక్షను రద్దుచేశారు. ఒకరికి బదులుగా వేరొకరు పరీక్షలు రాస్తూ.. మోసగించారనే ఆరోపణలపై హరియాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు ఆగస్టు 21న అరెస్టు చేశారు. దీనిపై కేరళ పోలీసులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించగా, ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు వీఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది త్వరలోనే తెలియపరుస్తామని తెలిపింది.
వీఎస్‌ఎస్‌సీలో టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్‌మెన్-బి, రేడియోగ్రాఫర్-ఎ పోస్టుల కోసం జాతీయస్థాయి పరీక్షను ఒక్క కేరళలోనే 10 కేంద్రాల్లో నిర్వహించారు. వేరేవారికి బదులుగా పరీక్షలు రాస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరితోపాటు హరియాణాకు చెందిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దరిమిలా పరీక్షను రద్దు చేయాలని వీఎస్‌ఎస్‌సీని పోలీసులు కోరారు.
హరియాణా నుంచే 400 మంది అభ్యర్థులు..
ఇస్రో నియామక పరీక్షకు హరియాణా నుంచే 400 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో కోచింగ్ కేంద్రాల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నిగ్గు తేల్చడానికి కేరళ నుంచి పోలీసుల బృందం హరియాణాకు వెళ్లనుంది. పరీక్షలో ఏదో అక్రమాలు జరుగుతాయంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఇన్విజిలేటర్లను అప్రమత్తం చేసినప్పుడు బండారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు. బటన్ కెమెరాలతో ప్రశ్నలను స్కాన్ చేసి ఎక్కడికో పంపించి, చెవిలో అమర్చుకున్న పరికరంతో సమాధానాలు విని పరీక్షలు రాశారని, ఆ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తామని వివరించారు.
ALSO READ:
టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్ ఆఫీసర్ ప్రాథమిక పరీక్ష కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 8న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 8న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ కీపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 23 నుంచి ఆగస్టు 25న సాయంత్రం 5 గంటల వరకు తెలపాల్సి ఉంటుందని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదుచేయాలని కమిషన్ స్పష్టంచేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..