IOCL Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2700 పోస్టుల భర్తీకి IOCL నోటిఫికేషన్.. అర్హతలు, ఫీజు వివరాలు
IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2025 నవంబర్ 28న 2700+ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అర్హులు.

IOCL Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. యువత కోసం ఒక పెద్ద జాబ్ నోటిఫికేషన్ ప్రకటన చేసింది. తన రిఫైనరీ విభాగంలో ట్రేడ్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల కోసం 2700 కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి నవంబర్ 28, 2025న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28 నుండి డిసెంబర్ 18, 2025 వరకు IOCL అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. భారీ సంఖ్యలో నియామకాలు జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ పై ఉత్కంఠ నెలకొంది.
నియామక నోటిఫికేషన్ ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 28న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 18 రాత్రి వరకు అప్లికేషన్ ఫారమ్‌లను నింపవచ్చు. IOCL రాత పరీక్షను డిసెంబర్ 29న నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. అయితే ఫలితాలను జనవరి 9, 2026 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పరీక్షే తుది ఎంపికకు ఆధారం కానుంది. కనుక అభ్యర్థులు ఎగ్జామ్‌కు బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
ఎన్ని రిఫైనరీలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
- గుజరాత్ రిఫైనరీ - 583
- పానిపట్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ - 707
- మథుర రిఫైనరీ - 189
- బరౌని రిఫైనరీ - 313
- హల్దియా రిఫైనరీ - 216
- దిగ్బోయ్ రిఫైనరీ - 110
- పారాదీప్ రిఫైనరీ - 413
- బొంగైగావ్ రిఫైనరీ - 142
- గువాహటి రిఫైనరీ - 82
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? అర్హతలు
- ట్రేడ్ అప్రెంటిస్ (అటెండెంట్ ఆపరేటర్): అభ్యర్థి మ్యాథ్స్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా పారిశ్రామిక రసాయన శాస్త్రంలో 3 సంవత్సరాల B.Sc. డిగ్రీ కలిగి ఉండాలి.
- టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేయడం తప్పనిసరి.
- ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్ మొదలైనవి): అభ్యర్థి మెట్రిక్ పాస్ అయి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి (Age Limit)
జనరల్ సహా EWS అభ్యర్థులకు వయస్సు 18 నుండి 24 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే, OBC (NCL) అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు. SC/ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు 29 సంవత్సరాలు కాగా, PwBD (UR/EWS) అభ్యర్థులకు గరిష్ట వయస్సు 34 సంవత్సరాలు.
ఎలా దరఖాస్తు చేయాలి?
- IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.comని సందర్శించాలి.
- మెనూలోని కెరీర్ (Career) విభాగంలోకి వెళ్లి అప్రెంటిస్‌షిప్స్ / రిక్రూట్‌మెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఈమెయిల్ ID, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, నమోదు చేసుకోండి.
- అన్ని వివరాలను జాగ్రత్తగా ఫిల్ చేయాలి. తరువాత ఫీజు ఉన్నవారు ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపిన తర్వాత సబ్మిట్ చేయాలి
- చివరగా, అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ అవుట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రంగా ఉంచుకోండి.























