(Source: Poll of Polls)
IB JIO Recruitment 2023: జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
IB JIO Result: కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JTO) గ్రేడ్-II/టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి.
Intelligence Bureau Junior Intelligence Officer Final Result 2023: కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JTO) గ్రేడ్-II/టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. జేటీవో పోస్టులకు నిర్వహించిన రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. గతేడాది జులై 22న నిర్వహించిన టైర్-1 రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన టైర్-2 (స్కిల్‌టెస్ట్), టైర్-2 (ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్) ఆధారంగా తుది ఫలితాలను ఇంటెలిజెన్స్ బ్యూరో జనవరి 29న విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రూల్ నెంబర్లతో అందుబాటులో ఉంచింది.
ఐబీ జేటీవో తుది ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాల కోసం అభ్యర్థులు మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.-https://www.mha.gov.in/en
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Final Result of Junior Intelligence Officer Grade – II / Technical Exam - 2023' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Step 4: అభ్యర్థులు తమ రూల్ నెంబరు ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు.
Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి.
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JTO) తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఇంటెలిజెన్స్ బ్యూరోలో మొత్తం 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్నికల్ పోస్టుల భర్తీకి గతేడాది మే 30న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో జనరల్ అభ్యర్థులకు 325 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 79 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 215 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకు 119 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకు 59 పోస్టులు కేటాయించారు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిగ్రీ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నుంచి జూన్ 3 నుంచి 23 వరకు దరఖాస్తులు స్వీకంచారు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు కల్పించారు. జూన్ 27 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. జులై 14న రాతపరీక్ష (టైర్-1) అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 22న రాతపరీక్ష నిర్వహించారు. పరీక్ష ఆన్సర్ కీని జులై 26న విడుదలచేసిన అధికారులు అక్టోబరు 9న ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన 4 వేల మంది అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్, ఇంటర్వూలు నిర్వహించారు.
ALSO READ:
Railway Jobs: దక్షిణ రైల్వేలో 2,860 అప్రెంటీస్ పోస్టులు
సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 50% మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మెరిట్ జాబితా, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..