Infosys Recruitment: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్, ఈ ఏడాది 55 వేల మందికి ఉద్యోగాలు
ఐటీ జాబ్స్ చేయాలనుకునే ఫ్రెషర్స్ కు ఇన్ఫోసిస్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది 55 వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకటించారు.
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల ఎక్స్ పోర్టర్ ఇన్ఫోసిస్(Infosys) ప్రెషర్స్(Freshers) కు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఏడాదిలో క్యాంపస్ సెలక్షన్స్(Campus Selections) కింద 55,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్(Salil Parekh) అన్నారు. బెంగళూరు(Bengalore)లోని ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ టెక్ రంగం(Tech Sector)లో ఇంజినీరింగ్ సైన్స్ గ్రాడ్యుయేట్(Engineering Science Graduates)లకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను నేర్చుకునే వారికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. 2022-23 ఏడాదిలో 55 వేల కాలేజీ గ్రాడ్యువేట్ లను రిక్రూట్ చేస్తామన్నారు. వచ్చే ఏడాదిలో ఆ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. నాస్కామ్ వార్షిక ఈవెంట్‌లో పరేఖ్ అన్నారు. 2022లో ఇన్ఫోసిస్ వార్షిక రాబడిలో 20 శాతం ఎగబాకాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఫ్రెషర్స్ కు కంపెనీలో చేరడానికి ఇదో గొప్ప అవకాశం అన్నారు. యువత నైపుణ్యత(Skills)పై దృష్టి పెట్టేందుకు ఆరు నుంచి 12 వారాల పాటు ఫ్రెషర్స్ కు శిక్షణ ఇస్తుందని పరేఖ్ అన్నారు.
ఉద్యోగులు అప్ డేట్ అవ్వాలి
కాలేజీ విద్యార్థుల కోసం, భారీ అవకాశాలు ఎదురుచూస్తున్నాయని, అయితే తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను వృద్ధి చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని పరేఖ్ కోరారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు ప్రతి దశాబ్దానికి తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. యువ గ్రాడ్యుయేట్లు ప్రతి మూడు నుంచి ఐదు సంవత్సరాలకు అప్ డేట్ అవ్వాలన్నారు. ఇన్ఫోసిస్ యువకుల భవిష్యత్తుకు చాలా మంచి రన్‌వే అన్నారు. భవిష్యత్‌లో పని చేసే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై దృష్టిసారిస్తున్నట్లు ఆయన అన్నారు. క్లయింట్‌ల కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చేపట్టడం వల్ల వస్తున్న పనితో, ఇతర వాటాదారుల విక్రేతలతో కలిసి పనిచేయడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందని పరేఖ్ చెప్పారు. క్లయింట్ అవసరాలను తీర్చడానికి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లను సర్వీస్ వర్క్‌గా ఏకీకృతం చేస్తామన్నారు.
వచ్చే ఏడాది మరిన్ని ఉద్యోగాలు
2022-23 ఆర్థిక సంవత్సరంలో కాలేజీ క్యాంపస్‌ల నుంచి 55 వేలకు పైగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. టెక్ రంగంలో ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులకు సదావకాశాలు ఉన్నాయన్నారు. యువత నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ మందిని నియమించుకోబోతున్నట్లు సలీల్ పరేఖ్ తెలిపారు. నైపుణ్యం కలిగిన హ్యూమన్ రిసోర్స్ పై కంపెనీ దృష్టి పెట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు కూడా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని స్పష్టం చేశారు.