IISST: ఐఐఎస్‌ఎస్‌టీ తిరువనంతపురంలో ప్రాజెక్టు పోస్టులు, వివరాలు ఇలా
IISST Recruitment: తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన జేపీఎఫ్, పీడీఎఫ్, జేఆర్‌ఎఫ్, పీఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IISST Recruitment: తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ప్రాజెక్టు ఫెలో, పోస్ట్ డాక్టోరల్ ఫెలో, జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేసన్ ద్వారా 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 09
* ప్రాజెక్టు పోస్టులు
➥ జూనియర్ ప్రాజెక్టు ఫెలో-04/2024: 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఏవియానిక్స్) ఉత్తీర్ణత. సర్క్యూట్ డిజైన్, పీసీబీ లేఅవుట్ డిజైన్, టెస్టింగ్ అండ్ amp: ఎలక్ట్రానిక్స్ డీబగ్గింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్, డేటా అనాలిసిస్ ఆఫ్ సైంటిఫిక్ డేటా ఫ్రమ్ పేలోడ్, మొదలైన వాటి మీద అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
జీతం: నెలకు రూ.28000.
➥ జూనియర్ ప్రాజెక్టు ఫెలో-05: 01 పోస్టు
అర్హత: బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా రిలేటెడ్ ఏరియాస్ లేదా ఎంఈ/ఎంటెక్(పవర్ ఎలక్ట్రానిక్స్) లేదా రిలేటెడ్ ఏరియాస్. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ బిల్డింగ్/ పవర్ ఎలక్ట్రానిక్ బిల్డింగ్/పవర్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్. ఎంబెడెడ్ సీ, మైక్రో-కంట్రోలర్‌లతో కోడింగ్, డీఎస్‌పీ అండ్ ఎఫ్‌పీజీఏలు రియల్ టైమ్ కంట్రోల్ అప్లికేషన్లపై అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
జీతం: నెలకు రూ.22000.
➥ జూనియర్ ప్రాజెక్టు ఫెలో-06: 01 పోస్టు
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేషన్ (వాతావరణ శాస్త్రం/వాతావరణ శాస్త్రం/ఎర్త్ సిస్టమ్ సైన్స్/ఫిజిక్స్) లేదా తత్సమానం/ ఎర్త్ సైన్స్‌లో బీఎస్-ఎంఎస్ లేదా తత్సమానం. అట్మాస్ఫియరిక్ మోడల్స్, డేటా అసిమిలేషన్/కోడింగ్ (పైథాన్) పరిజ్ఞానం ఉండాలి.
జీతం: నెలకు రూ.31000.
➥ పోస్ట్ డాక్టోరల్ ఫెలో: 01 పోస్టు
అర్హత: పీహెచ్‌డీ (పవర్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా రిలేటెడ్ ఏరియాస్. సిమ్యులేషన్ అండ్ బిల్డింగ్ పవర్ కన్వర్టర్లు, ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు ప్రోగ్రామింగ్, పవర్ కన్వర్టర్ల టెస్టింగ్ జ్ఞానం ఉండాలి. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ రూపకల్పన, పీసీబీ లేఅవుట్ అండ్ పీసీబీ అసెంబ్లీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
జీతం: నెలకు రూ.80000.
➥ జూనియర్ రిసెర్చ్ ఫెలో-03: 02 పోస్టులు
అర్హత: ఎంటెక్/ఎంఈ(పవర్ ఎలక్ట్రానిక్స్) లేదా తత్సమానం. డిజైనింగ్ అండ్ బిల్డింగ్ హార్డ్‌వేర్ సెటప్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
జీతం: నెలకు రూ.37000.
➥ జూనియర్ రిసెర్చ్ ఫెలో-04: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్(మెకానికల్ ఇంజినీరింగ్) లేదా రిలేటెడ్ ఏరియాస్. స్పెషలైజేషన్: - థర్మల్ ఇంజనీరింగ్. మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ ఆఫ్ థర్మల్ సిస్టమ్స్‌పై అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.37000.
➥ ప్రాజెక్టు అసోసియేట్-I- 01: 01 పోస్టు
అర్హత: ఎంఎస్‌డబ్ల్యూ/పబ్లిక్ హెల్త్/హెల్త్ మేనేజ్‌మెంట్/హెల్త్ సైన్స్/ పబ్లిక్ హెల్త్/ ఏదైనా ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు/లైఫ్ సైన్సెస్/జువాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ కలిగి ఉండాలి. ఎక్స్‌లెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
జీతం: నెలకు రూ.31000.
➥ప్రాజెక్టు అసోసియేట్-I- 02: 01 పోస్టు
అర్హత: ఎంటెక్/బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీర్)/ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్ సైన్స్ లేదా ఏదైనా ఇతర అనుబంధ విభాగాలు). MATLABand/లేదా పైథాన్‌పై పరిజ్ఞానం తప్పనిసరి. లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ అండ్ రాండమ్ ప్రాసెస్ యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. బీటెక్/ఎంఎస్సీ అభ్యర్థులకు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.31000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.03.2024.