(Source: ECI/ABP News/ABP Majha)
GDS Results: ఏపీ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల మూడో జాబితాను అధికారులు అక్టోబరు 21న విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల మూడో జాబితాను అధికారులు అక్టోబరు 21న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాలకు సంబంధించి ఏపీ నుంచి 100 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు.
గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 1,058 పోస్టులు ఉన్నాయి. ఇందుకోసం ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. తొలి రెండు జాబితాల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. తాజా మూడో జాబితా వెల్లడించారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 30లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.
ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల మూడో జాబితా కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ పరిధిలో మొత్తం 1,058 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
ALSO READ:
నాసిక్- కరెన్సీ నోట్ ప్రెస్‌లో 117 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
మహారాష్ట్ర నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్‌వైజర్, ఆర్టిస్ట్, సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 117 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 496 పోస్టులని భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..