News
News
X

IBPS SO Hall Ticket: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్, డైరెక్ట్ లింక్ ఇదే!

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డు పొందవచ్చు. డిసెంబరు 31 వరకు కాల్‌ లెటర్లు అందుబాటులో ఉండనున్నాయి. 

FOLLOW US: 
Share:

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డిసెంబరు 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డు పొందవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 31న ఐబీపీఎస్ ఎస్‌వో పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. డిసెంబరు 31 వరకు కాల్‌ లెటర్లు అందుబాటులో ఉండనున్నాయి. 

అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Online Preliminary Exam Call Letter for CRP SPL XII' లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి. 

Step 4: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.

Step 5:  అడ్మిట్ కార్డు డౌన్‌‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షరోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లడం మంచిది.

IBPS SO prelims exam information handout

Direct link to download IBPS SO admit card 2022

ప్రిలిమినరీ పరీక్ష విధానం:

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు:
 హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్; చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 580 పోస్టులు, యూకోబ్యాంకులో 100 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 30 పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వివరాలు..

1)  ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 44 పోస్టులు

2) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 516 పోస్టులు

3) రాజ్‌భాష అధికారి (స్కేల్-1): 25 పోస్టులు

4) లా ఆఫీసర్ (స్కేల్-1): 10 పోస్టులు

5) హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 15 పోస్టులు

6) మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 100 పోస్టులు

నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2022.

➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2022.

➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 24.12.2022, 31.12.2022.

➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2023.

➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2023.

➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 29.01.2023.

➥ తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2023.

➥ ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి, 2023.

➥ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2023.

➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్:  ఏప్రిల్, 2023.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 19 Dec 2022 08:04 PM (IST) Tags: IBPS SO admit card 2022 IBPS SO Recruitment 2022 IBPS SO Prelims Admit Card 2022 IBPS SO Hall Ticket IBPS SO Prelims Admit Card 2022 Download

సంబంధిత కథనాలు

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

SSC Selection Posts: 5369 సెలక్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

SSC Selection Posts: 5369 సెలక్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!

IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SAIL Recruitment: బొకారో స్టీల్ ప్లాంటులో 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అర్హతలివే!

SAIL Recruitment: బొకారో స్టీల్ ప్లాంటులో 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అర్హతలివే!

టాప్ స్టోరీస్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !

Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!