GK Questions: కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ ముఖ్యమైన అంశాలు మీకు తెలుసా!
What Is AGMARK | ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాసే అభ్యర్థులతో పాటు యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్, బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఈ విషయాలు ఉపయోగపడతాయి.
APPSC Exam Questions | ఏపీ, తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ తదితర అంశాలను పాయింట్ల రూపంలో మీకు అందిస్తున్నాం.
GENERAL KNOWLEDGE
1. క్విట్ ఇండియా (Quit India) నినాదం రూపకర్త ఎవరు? యూసుఫ్ మెహర్ ఆలీ
2. ఇటీవల భారత ప్రభుత్వం ఆపరేషన్ సద్భావ్ ఎందుకు చేపట్టింది? యాగి తుఫాను బాధితుల కొరకు (వియత్నం, మయన్మార్ ,లావోస్ లో ఉన్న వారిని)
3. ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 3
4. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హింధు రాజు ఎవరు? హర్షుడు
5. ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో తొలిసారిగా కలప తో తయారుచేసిన ఉపగ్రహం పేరు? లిగ్నోశాట్
6. ఆగ్ మార్క్ ముద్ర ఏ వస్తువులకు ఉపయోగిస్తారు? వ్యవసాయ ఆధారిత వస్తువులు
7. భారతదేశ సుప్రీంకోర్టు భవన రూపశిల్పి ఎవరు? గణేష్ బికాజి డయోల్కర్.
8. 1927 సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన సమయంలో బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎవరు? స్టాన్లీ బాల్డ్విన్
9. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎవరు స్థాపించారు? స్వామి రామానంద తీర్థ
10. దేవ సమాజ్ ఎవరు స్థాపించారు? శివ నారాయణ అగ్నిహోత్ర
11. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎప్పుడు స్థాపించారు? 1905
12. అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 11
13. దేశములో అత్యధిక అటవీ విస్తీర్ణ కలిగిన రాష్ట్రం? మధ్యప్రదేశ్
14. దేశంలోనే తొలి వందే భారత్ రైల్ మెట్రో సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుజరాత్ (అహ్మదాబాద్ -- భుజ్)
15. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ను ఇటీవలే ఏ పేరుతో పిలుస్తున్నారు? రామ్ గంగా నేషనల్ పార్క్.
Also Read: Current Affairs: పోటీ పరీక్షలకు స్పెషల్ కరెంట్ అఫైర్స్ - ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
INDIAN POLITY
1. ఎవరి పుట్టినరోజు అక్టోబర్ 15న అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటారు?-- ఎ.పి.జే. అబ్దుల్ కలమ్
2. టెంపుల్టన్ అవార్డు (అమెరికా) పొందిన మొదటి భారతీయుడు?-- డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
3. వార్తాపత్రికలను ఫోర్త్ ఎస్టేట్ అని వర్ణించినది ఎవరు?-- ఎడ్మండ్ బర్గ్
4. భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక విధులు ఎన్ని?-- 11
5. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ ఎక్కడ ఉంది?-- మైసూర్
6. భారతీయ రూ.1/-నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది?-- కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి
7. కేంద్ర పాలిత ప్రాంతమైన "పుదుచ్చేరి" ఏ ఏ ప్రాంతాలు కలయిక వలన ఏర్పడింది?-- యానం (ఆంధ్రప్రదేశ్), కరైకల్ (తమిళనాడు), మహే(కేరళ)
8. భారత రాజ్యాంగంలో అతి పెద్ద భాగం ఏది?-- 5 వ భాగం
9. ప్రవేశిక రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిది అని అన్నది ఎవరు?-- నాని పాల్కీ వాలా
10. భారత రాజ్యాంగానికి మాతృక /నకలు అని "ఏ భారత ప్రభుత్వ చట్టాన్ని" పిలుస్తారు?-- 1935
11. జాతీయ చిహ్నం కింద ఉన్న "సత్యమేవ జయతే "అన్న పదాలను ఎక్కడ నుండి గ్రహించారు?-- ముండకో పనిషత్
12. గాంధీజీ ఆధ్యాత్మిక గురువు ఎవరు?-- "లియో టాల్ స్థాయ్"
13. "భారతదేశ వజ్రం "అనే బిరుదు ఎవరికి కలదు?-- గోపాలకృష్ణ గోఖలే
14. భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి ఎవరు?-- మౌలానా అబుల్ కలామ్ అజాద్
15. "ది ఇండియన్ స్ట్రగుల్" గ్రంథకర్త ఎవరు?-- సుభాష్ చంద్రబోస్
Also Read: అమరావతికి ఆర్థిక సాయం చేస్తున్న ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?