Fisheries Recruitment: నెల్లూరు జిల్లా మత్స్యశాఖలో సాగర మిత్ర ఉద్యోగాలు, అర్హతలివే
నెల్లూరులోని మత్స్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సాగర మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
![Fisheries Recruitment: నెల్లూరు జిల్లా మత్స్యశాఖలో సాగర మిత్ర ఉద్యోగాలు, అర్హతలివే Fisheries Department SPSR Nellore District Has Released Notification for the Recruitment of Sagaramitra Posts Through Walk in Interview Fisheries Recruitment: నెల్లూరు జిల్లా మత్స్యశాఖలో సాగర మిత్ర ఉద్యోగాలు, అర్హతలివే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/d7cd188f4bf8b69da360b960f354bd351697724049214522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నెల్లూరులోని మత్స్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సాగర మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ(ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 30
* సాగర మిత్ర పోస్టులు
అర్హతలు: డిగ్రీ (ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సంబంధిత చిరునామాలో సమర్పించాలి.
ఎంపిక విధానం: రోస్టర్ ప్రాతిపదికన, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: నెలకు రూ.15,000.
చిరునామా: Commissioner of Fisheries, Nellore.
దరఖాస్తుకు చివరి తేదీ: 28.10.2023.
ALSO READ:
నాసిక్- కరెన్సీ నోట్ ప్రెస్‌లో 117 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
మహారాష్ట్ర నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్‌వైజర్, ఆర్టిస్ట్, సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 117 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆప్కాబ్‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)