AP AHA Results 2024: ఏపీ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఫలితాల వెల్లడి జనవరి 18కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandry Assistant ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను జనవరి 18న విడుదల చేయనున్నారు.
![AP AHA Results 2024: ఏపీ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఫలితాల వెల్లడి జనవరి 18కి వాయిదా Due to unavoidable circumstances release of AHA results is postponed to tomorrow ie January 18 AP AHA Results 2024: ఏపీ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఫలితాల వెల్లడి జనవరి 18కి వాయిదా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/c31c2213750d6fc67e8a59a67990089e1705503130653522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP AHA Ressults: ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandry Assistant ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను జనవరి 18న విడుదలకానున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల వెల్లడి తర్వాత వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 17న ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఫలితాల వెల్లడిని వాయిదావేశారు.
ఏపీ పశుసంవర్థక శాఖలో 1896 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 31న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాత పరీక్ష ప్రాథమిక, ఫైనల్ ఆన్సర్ 'కీ'ని క్వశ్చన్ పేపర్‌తోపాటు అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 18న ఫలితాలను వెల్లడించనున్నారు.
ఏపీ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 1896 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా (Polytechnic), ఇంటర్ ఒకేషనల్ (Inter Vocational) కోర్సు, బీటెక్ (BTech), బీఎస్సీ (BSc), ఎంఎస్సీ(MSc) అర్హత ఉన్నవారినుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్ 27న విడుదల చేశారు. డిసెంబరు 31న రాతపరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.22,460- రూ.72,810 వేతనం ఉంటుంది. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.
వివరాలు..
* యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టులు
ఖాళీల సంఖ్య: 1896.
జిల్లాలవారీగా ఖాళీలు..
➥ అనంతపురం: 473 పోస్టులు
➥ చిత్తూరు జిల్లా: 100 పోస్టులు
➥ కర్నూలు జిల్లా: 252 పోస్టులు
➥ వైఎస్‌ఆర్ కడప: 210 పోస్టులు
➥ నెల్లూరు జిల్లా: 143 పోస్టులు
➥ ప్రకాశం జిల్లా: 177 పోస్టులు
➥ గుంటూరు జిల్లా: 229 పోస్టులు
➥ కృష్ణా జిల్లా: 120 పోస్టులు
➥ పశ్చిమ గోదావరి జిల్లా: 102 పోస్టులు
➥ తూర్పు గోదావరి జిల్లా: 15 పోస్టులు
➥ విశాఖపట్నం జిల్లా: 28 పోస్టులు
➥ విజయనగరం జిల్లా: 13 పోస్టులు
➥ శ్రీకాకుళం జిల్లా: 34 పోస్టులు
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
ఏపీ జ్యుడీషియల్ సర్వీసులో జూనియర్ సివిల్ జడ్జ్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 39 ఖాళీలను భర్తీచేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తారు. లా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)