De-Addicton: డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ నరసాపురంలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ ఏరియా హాస్పిటల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ ఏరియా హాస్పిటల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 8వ తరగతి, ఎంబీబీఎస్, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు జనవరి 17 నుంచి 31 వరకు దరఖాస్తులు సంబంధిత చిరునామాలో సమర్పించాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 08
⏩ డాక్టర్(ఫుల్ టైమ్): 01 పోస్టు
అర్హతలు: మెడికల్ కౌన్సిల్/మెడికల్ కమీషన్‌తో రిజిస్ట్రేషన్ చేయబడిన ఎంబీబీఎస్‌తో పాటు DDACలో చేరిన మూడు నెలల్లో MOSJE/NISD ద్వారా శిక్షణ పొందాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల కోసం 03 సంవత్సరాలు(సాయుధ దళాలలో సేవా నిడివితో పాటు.), దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.60,000(గ్రామీణ), రూ.55,000(పట్టణ).
⏩ కౌన్సెలర్/ సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్: 02 పోస్టులు
అర్హతలు: సోషల్ సైన్సెస్(సోషల్ వర్క్/సైకాలజీ)లో గ్రాడ్యుయేట్, ఫీల్డ్‌లో 1-2 సంవత్సరాల అనుభవంతో పాటు ఇంగ్లీషుతో పాటు ఒక ప్రాంతీయ భాషపై కూడా పరిజ్ఞానం ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి డి-అడిక్షన్ కౌన్సెలింగ్‌లో శిక్షణా కోర్సు యొక్క సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల కోసం 03 సంవత్సరాలు(సాయుధ దళాలలో సేవా నిడివితో పాటు.), దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.17,500.
⏩ యోగా థెరపిస్ట్/ డ్యాన్స్ టీచర్/ టీచర్ (పార్ట్ టైమ్): 01 పోస్టు
అర్హతలు: సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల కోసం 03 సంవత్సరాలు(సాయుధ దళాలలో సేవా నిడివితో పాటు.), దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.5,000.
⏩ నర్స్ (ఫుల్ టైమ్): 02 పోస్టులు
అర్హతలు: జీఎస్‌ఎం/బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, MSJ&EGoI ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల కోసం 03 సంవత్సరాలు(సాయుధ దళాలలో సేవా నిడివితో పాటు.), దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.15,000.
⏩ వార్డ్ బాయ్స్: 02 పోస్టులు
అర్హతలు: 8వ తరగతి ఉత్తీర్ణతతోపాటు హాస్పిటల్స్/హెల్త్ కేర్ సెంటర్లు/డి-అడిక్షన్ సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల కోసం 03 సంవత్సరాలు(సాయుధ దళాలలో సేవా నిడివితో పాటు.), దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.13,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The office of District Coordinator of Hospital Services,
West Godavari District premises of office of the District
Collector West Godavari District, Bhimavaram.
ఎంపిక విధానం: రిజర్వేషన్ మరియు రోస్టర్ నిబంధనలను అనుసరించి జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 17.01.2024
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.01.2024.