DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 10లోపు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
మచిలీపట్నంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 10లోపు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 16న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్ జాబితా, ఫిబ్రవరి 20న తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 16.
➥ డార్క్ రూమ్ అసిస్టెంట్: 03 పోస్టులు
➥ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్: 05 పోస్టులు
➥ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 05 పోస్టులు
➥ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్: 01 పోస్టు
➥ స్ట్రెచర్ బేరర్/ స్ట్రెచర్ బాయ్: 01 పోస్టు
➥ సీటీ టెక్నీషియన్: 01 పోస్టు
అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నాయర్ బడ్డి సెంటర్, మచిలీపట్నంలో అందజేయాలి.
ముఖ్యమైనతేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేదీ: 03.02.2023
➥ దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023.
➥ తాత్కాలిక మెరిట్ జాబితా వెల్లడి: 16.2.2023.
➥ అభ్యర్థుల తుది ఎంపిక జాబితా వెల్లడి: 20.2.2023.
➥ కౌన్సెలింగ్, నియామక పత్రాల పంపిణీ: 23.2.2023.
Also Read:
పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 626 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?
బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..