AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్, సికింద్రాబాద్ వివిధ రీజియన్లలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 1,793
రీజియన్లు: ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తర్న్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్.
1) ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 1249 పోస్టులు
అర్హతలు: పదోతరగతి అర్హతతోపాటు ఐటీఐ ఉండాలి.
2) ఫైర్‌మ్యాన్: 544 పోస్టులు
అర్హతలు: పదోతరగతి అర్హత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీత భత్యాలు: నెలకు ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900; ఫైర్‌మ్యాన్ ఖాళీలకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎండ్యూరెన్స్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.02.2023.
Also Read:
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?
బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..