Meeseva: నారాయణపేట జిల్లాలో మీసేవా కేంద్రం ఖాళీలు, ఈ అర్హతలుండాలి
Meeseva Recruitment: నారాయణపేటలోని జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీ నారాయణపేట జిల్లాలో మీసేవా సెంటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
![Meeseva: నారాయణపేట జిల్లాలో మీసేవా కేంద్రం ఖాళీలు, ఈ అర్హతలుండాలి District E-Governance Society of Narayanapet invites applications from eligible candidates for setting up new Meeseva Centers in Narayanapet district. Meeseva: నారాయణపేట జిల్లాలో మీసేవా కేంద్రం ఖాళీలు, ఈ అర్హతలుండాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/cb948a892ea399849dfd39767f8921c51707361825989522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Meeseva Recruitment: నారాయణపేటలోని జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీ నారాయణపేట జిల్లాలో కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటు చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 20 మీసేవా సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. డిగ్రీ. కంప్యూటర్ జ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కేంద్ర మరియి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కలిగిన కుటుంబ సబ్యులు మీసేవా దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. మీసేవా ఏర్పాటు చేయు అభ్యర్థులు ఆ గ్రామపంచాయతి స్థానికులై ఉండాలి. రాత పరీక్ష, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థికి మీసేవా కేంద్రం ఏర్పాటు చేయుటకు తగిన ఆర్ధిక స్థోమత కలిగి ఉండవలెను.
వివరాలు..
* మీసేవా కేంద్రం: 20 ఖాళీలు
మీసేవా కేంద్రములు ఏర్పాటు చేయదలచిన ప్రదేశాలు లేదా గ్రామాలు..
క్రమ సంఖ్య | మండలం | గ్రామము | కేటాయుంచబడిన మీసేవలు |
1. | దామర్ గిద్ద | క్యాతన్ పల్లి | 1 |
2. | దన్వాడ | కిస్టపుర్ | 1 |
3. | దన్వాడ | గోడూర్ | 1 |
4. | గుండ్మాల్ | గుండ్మాల్ | 1 |
5. | కొత్తపల్లి | కొత్తపల్లి | 1 |
6. | మద్దూరు | మద్దూరు | 1 |
7. | మక్తల్ | మక్తల్ | 1 |
8. | మక్తల్ | చిత్యల్ | 1 |
9. | మరీకల్ | కన్మనుర్ | 1 |
10. | నారాయణపేట | కోటకొండ | 1 |
11. | నారాయణపేట | నారాయణపేట | 1 |
12. | నారాయణపేట | అభంగాపూర్ | 1 |
13. | నారాయణపేట | చిన్నజెట్రం | 1 |
14. | నారాయణపేట | అప్పక్‌పల్లి | 1 |
15. | మగానూర్ | మగానూర్ | 1 |
16. | క్రష్ట | కున్సి | 1 |
17. | నర్వ | పతెర్చెడ్ | 1 |
18. | నర్వ | ఉందేకొడ్ | 1 |
19. | నర్వ | యంకి | 1 |
20. | ఉట్కూర్ | బిజ్వర్ | 1 |
అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ జ్ఞానం.
వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తుఫీజు: రూ.500 ''District e-Governance Society Narayanpet District'' వారి పేరు మీద డీడీ తీసి దరఖాస్తు ఫారమ్‌కు జతచేయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నారాయణపేట కలెక్టరేట్ గారి కార్యాలయంలో దరఖాస్తులను స్వయంగా సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్షవిధానం: మొత్తం 100 మార్కులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై ప్రశ్నలు అడుగుతారు. 90 మార్కులు, సమయం 90 నిమిషాలు. విద్యార్హతలు & టెక్నికల్ సర్టిఫికేట్‌లు: 05 మార్కులు, ఇంటర్వ్యూ: 05 మార్కులు.
ముఖ్యమైనతేదీలు..
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2024.
పరీక్ష తేదీ: 25.02.2024.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)