అన్వేషించండి

Delhi Police: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ 'ట్రేడ్ టెస్ట్' అడ్మిట్ కార్డులు విడుదల, షెడ్యూలు ఇదే

ఢిల్లీ పోలీసు విభాగం కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ట్రేడ్ టెస్ట్ అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది.

ఢిల్లీ పోలీసు విభాగం కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ట్రేడ్ టెస్ట్ అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ/ రోల్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ఫిజికల్ ఈవెంటల్లో అర్హత సాధించిన అభ్యర్థుల డ్రైవింగ్ నైపుణ్యాలు పరీక్షించేందుకు అక్టోబరు 10 నుంచి నవంబరు 8 వరకు ట్రేడ్ టెస్టులు(డ్రైవింగ్ టెస్ట్) నిర్వహించనున్నారు. టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వారిని మాత్రమే టెస్టుకు అనుమతిస్తారు. ఢిల్లీ పోలీసు విభాగం డిజిలాకర్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయనుంది. 

అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

➥ మొత్తం 150 మార్కులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే తర్వాతి దశలో పరిగణనలోకి తీసకుంటారు.  ఈ పరీక్ష అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ర్యాంకింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. అయితే పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

➥ లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్‌లో భాగంగా అభ్యర్థులు 50 మార్కులకుగాను కనీసం 25 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఫార్వర్డ్ డ్రైవింగ్, రివర్స్ డ్రైవింగ్, పార్కింగ్ అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.

➥ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్‌లో భాగంగా అభ్యర్థులు 50 మార్కులకుగాను కనీసం 25 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ చిహ్నాలు, రహదారి అవగాహన, బేసిక్ డ్రైవింగ్ నిబంధనలకు సంబంధించి 25 మార్కులకుగాను కనీసం 12.5 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

➥ వెహికిల్ మెయింటెనెన్స్ అంశానికి 25 మార్కులు కేటాయించారు. ఇందులో కనీసం 12.5 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

ఢిల్లీ పోలీసు విభాగంలో 1411 కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది జులై 8న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో జనరల్-604, ఈడబ్ల్యూఎస్-142, ఓబీసీ-353, ఎస్సీ-262, ఎస్టీ-50 పోస్టులు కేటాయించారు. వీటి నుంచ ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగానికి 141 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21న రాతపరీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితాలను డిసెంబరు 29న వెల్లడించారు. రాతపరీక్షలో 26,998 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికయ్యారు. అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి 28 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ట్రేడ్ టెస్టు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది.

ALSO READ:

ఎస్‌ఐ ఫైనల్ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, పరీక్ష ఎప్పుడంటే?
ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అక్టోబరు 6న పోలీసు నియామక బోర్డు విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబరు 12 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నెంబరు 9441450639, 9100203323 లేదా ఈమెయిల్ mail-slprb@ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ జెన్‌కో‌లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget