అన్వేషించండి

CTET Exam: నేటి నుంచి 'సీటెట్-2022' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలివే!

ఈ ఏడాది సీటెట్ పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 2.59 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)-2022 పరీక్ష నిర్వహణకు సీబీఎస్‌ఈ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. డిసెంబరు 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 243 కేంద్రాల్లో సీటెట్-2022 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది సీటెట్ పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 2.59 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. మొత్తం 74 నగరాల్లోని 243 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డు‌లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబరు-2022 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) డిసెంబరు 26న విడుదల చేసింది. హాల్‌టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సీటెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు.

CTET అడ్మిట్ కార్డ్ 2022 డైరెక్ట్ లింక్

సీబీఎస్‌ఈ డిసెంబరు 20నే అభ్యర్థులకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ (ప్రీ-అడ్మిట్ కార్డ్) విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. అభ్యర్థులు పరీక్ష రోజున అడ్మిట్ కార్డును మర్చిపోకూడదు. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లడం మంచింది. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 28, 29 తేదీల్లో సీటెట్ (డిసెంబరు)-2022 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

➥ అభ్యర్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం పరీక్ష రాసే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఆఖరి నిమిషంలో కాకుండా ఉదయం 7.30 గంటల కల్లా చేరుకోవాలి. సెకండ్ సెషన్‌లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులైతే మధ్యాహ్నం 12 గంటల కల్లా చేరుకోవాలి.

➥అడ్మిట్ కార్డును వెంట తీసుకురావడం మరిచిపోవద్దు. సీటెట్-2022 అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష హాలులోకి అనుమతించరు.

➥ అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి. ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తెచ్చుకోవాలి.

➥ వీటితో పాటు అభ్యర్థులు అదనంగా నీళ్ల బాటిల్, మాస్కు, శానిటైజర్, గ్లౌజులు తెచ్చుకోవచ్చు.

➥ పరీక్ష హాలులోకి ఎలక్ట్రానిక్/కమ్యూనికేషన్ పరికరాలకు అనుమతించరు. మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, మైక్రోఫోన్‌లు, హెల్త్‌బ్యాండ్‌లతో పాటు వాచ్, వ్యాలెట్, కళ్లద్దాలు, హ్యాంండ్ బ్యాగ్‌లు, కృత్రిమ ఆభరణాలకు అనుమతిలేదు.

పరీక్ష విధానం..

✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్) - 2022' నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు.

సీటెట్‌ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్‌(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్‌ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

సీటెట్ నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget