By: ABP Desam | Updated at : 18 Jan 2023 02:31 PM (IST)
Edited By: omeprakash
సీఐఎస్‌ఎఫ్ అడ్మిట్ కార్డులు
సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ పరీక్షల అడ్మిట్ కార్డులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జనవరి 18న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) నిర్వహించనున్నారు. ఫిజికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు.. తర్వాతి దశలో రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత పొందినవారికి స్కిల్‌టెస్ట్, మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులో దాదాపు 540 ఏఎస్‌ఐ, హెడ్-కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 25 వరకు ఇంటర్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ఫీజుగా రూ.100 వసూలు చేసింది. ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఖాళీలను భర్తీచేయనుంది.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..
Step 1: అడ్మిట్‌కార్డుల కోసం అభ్యర్థులు మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- cisfrectt.in
Step 2: అక్కడ హోంపేజీలో "Recruitment" ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
Step 3: క్లిక్ చేయగానే వచ్చే పేజీలో కనిపించే "Head Constable (Ministerial) and Assistant Sub Inspector" admit card లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 4: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
Step 5: వివరాలు నమోదుచేసి "Submit" బటన్ మీద క్లిక్ చేయాలి..
Step 6: అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Step 7: హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
సీఐఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట్రీరియల్) శారీరక ప్రమాణాలు:
ఎత్తు: పురుష అభ్యర్థులు- 165 సెం.మీ., మహిళా అభ్యర్థులు-155 సెం.మీ.
ఛాతీ: పురుష అభ్యర్థులు- కనీసం 72 సెం.మీ., (అన్-ఎక్స్‌పాన్డెడ్) 72 సెం.మీ.,(ఎక్స్‌పాన్డెడ్). ఎస్టీ అభ్యర్థులకు 76-81 సెం.మీ (కనీసం 5 సెం.మీ ఎక్స్‌పాన్షన్)
బరువు: వయసు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
కంటిచూపు:
➥ డిస్టెన్స్ విజన్- 6/6 (మొదటి కన్ను), 6/9 (రెండో కన్ను)
➥ నియర్ విజన్- 0.6 (మొదటి కన్ను), 0.8 (రెండో కన్ను).
వినికిడి: సాధారణంగా ఉండాలి.
ఫిజికల్ ఫిట్నెస్: అభ్యర్థులు శారీరంగా, మానసికంగా దృఢంగా ఉండాలి.
[Note: పర్వతప్రాంతాలు, ఎస్టీలకు నిబంధనల ప్రకారం శారీరక ప్రమాణాల్లో సడలింపు వర్తిస్తుంది.]
స్కిల్ టెస్ట్ ఇలా..
➥ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) పోస్టులకు నిర్వహించే స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత)లో నిమిషానికి 80 పదాల చొప్పున 10 నిమిషాల పాటు డిక్టేషన్ ఉంటుంది. కంప్యూటర్‌పై ట్రాన్‌స్క్రిప్షన్ టైమ్- ఇంగ్లిష్-50 నిమిషాలు, హిందీ-65 నిమిషాలు ఉంటుంది.
➥హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులకు నిర్వహించే స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత)లో నిమిషానికి 35 పదాల చొప్పున ఇంగ్లిష్ టైపింగ్, నిమిషానికి 35 పదాల చొప్పున హిందీ టైపింగ్ ఉంటుంది. కంప్యూటర్‌పై ట్రాన్‌స్క్రిప్షన్ టైమ్- ఇంగ్లిష్-50 నిమిషాలు, హిందీ-65 నిమిషాలు ఉంటుంది.
Also Read:
సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!
High Court JCJ Posts: తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు, అర్హతలివే!
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?