Bank Jobs: సెంట్రల్ బ్యాంకులో 1000 మేనేజర్ పోస్టులు, ఎంపికైతే రూ.69 వేల వరకు జీతం!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1000 మేనేజర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మిడిల్ మేనేజ్‌మెంట్ (మెయిన్ స్ట్రీమ్) స్కేల్-2 1000 మేనేజర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు జులై 15లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
➥ మేనేజర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1000
పోస్టుల కేటాయింపు: జనరల్-405, ఈడబ్ల్యూఎస్-100, ఓబీసీ-270, ఎస్సీ-150, ఎస్టీ-75.
విభాగం: మిడిల్ మేనేజ్‌మెంట్ (మెయిన్ స్ట్రీమ్) స్కేల్-2.
అర్హత: ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా కనీసం మూడేళ్ల పని అనుభవం. (లేదా) పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్‌ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.05.2023 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత కుటుంబీకులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, కమిషన్డ్ ఆఫీసర్లకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం..
➥ మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలుంటాయి. వీటిలో బ్యాంకింగ్-60 ప్రశ్నలు- 60 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్-20 ప్రశ్నలు-20 మార్కులు, ఎకనామిక్స్ & జనరల్ అవేర్‌నెస్ నుంచి-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
➥ మొత్తం 100 మార్కులు ఇంటర్వ్యూ ప్రక్రియ ఉంటుంది. ఇందులో అర్హత మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ అభ్యర్థులకు 45 శాతంగా నిర్ణయించారు.
జీతం: నెలకు రూ.48,170-రూ.69,810.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.07.2023.
➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.
ALSO READ:
'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial