BSF: బీఎస్‌ఎఫ్‌లో 1,526 ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు- వివరాలు ఇలా
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ (క్లర్క్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్-2024 ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు.
BSF Recruitment 2024: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఏఆర్)లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1,526 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్‌తో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్-2024 ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్న పురుష/ మహిళా అభ్యర్థులు జులై 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 1,526.
ఫోర్స్, పోస్టులు మరియు కేటగిరీ వారీగా ఖాళీలు..
1. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)- (స్టెనోగ్రాఫర్/ కంబాటెంట్ స్టెనోగ్రాఫర్) అండ్ వారెంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్): 243 పోస్టులు
➥ బీఎస్ఎఫ్(మేల్ అండ్ ఫిమేల్): 17
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 02, ఈడబ్ల్యూఎస్- 02, ఎస్సీ- 02, ఎస్టీ- 11.
➥ సీఆర్‌పీఎఫ్(మేల్ అండ్ ఫిమేల్): 21
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 08, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 06, ఎస్సీ- 03, ఎస్టీ- 02.
➥ ఐటీబీపీ: 56
రిజర్వ్ కేటగిరీ(మేల్): జనరల్- 19, ఈడబ్ల్యూఎస్- 05, ఓబీసీ- 14, ఎస్సీ- 06, ఎస్టీ- 04.
రిజర్వ్ కేటగిరీ(ఫిమేల్): జనరల్- 03, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 02, ఎస్సీ- 01, ఎస్టీ- 01.
➥ సీఐఎస్‌ఎఫ్: 146
రిజర్వ్ కేటగిరీ(మేల్): జనరల్- 37, ఈడబ్ల్యూఎస్- 08, ఓబీసీ- 47, ఎస్సీ- 29, ఎస్టీ- 15.
రిజర్వ్ కేటగిరీ(ఫిమేల్): జనరల్- 06, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 02, ఎస్సీ- 01.
➥ ఎస్‌ఎస్‌బీ(మేల్ అండ్ ఫిమేల్): 03
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 02, ఓబీసీ- 01.
2. హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) (మినిస్టీరియల్/ కంబాటెంట్ మినిస్టీరియల్), హవల్దార్ (క్లర్క్): 1,283 పోస్టులు
➥ బీఎస్ఎఫ్(మేల్ అండ్ ఫిమేల్): 302
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 80, ఈడబ్ల్యూఎస్- 20, ఓబీసీ- 99, ఎస్సీ- 47, ఎస్టీ- 56.
➥ సీఆర్‌పీఎఫ్(మేల్ అండ్ ఫిమేల్): 282
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 110, ఈడబ్ల్యూఎస్- 27, ఓబీసీ- 73, ఎస్సీ- 41, ఎస్టీ- 31.
➥ ఐటీబీపీ: 163
రిజర్వ్ కేటగిరీ(మేల్): జనరల్- 78, ఈడబ్ల్యూఎస్- 09, ఓబీసీ- 19, ఎస్సీ- 26, ఎస్టీ- 06.
రిజర్వ్ కేటగిరీ(ఫిమేల్): జనరల్- 14, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 03, ఎస్సీ- 05, ఎస్టీ- 01.
➥ సీఐఎస్‌ఎఫ్: 496
రిజర్వ్ కేటగిరీ(మేల్): జనరల్- 182, ఈడబ్ల్యూఎస్- 44, ఓబీసీ- 120, ఎస్సీ- 67, ఎస్టీ- 33.
రిజర్వ్ కేటగిరీ(ఫిమేల్): జనరల్- 22, ఈడబ్ల్యూఎస్- 05, ఓబీసీ- 13, ఎస్సీ- 07, ఎస్టీ- 03.
➥ ఎస్‌ఎస్‌బీ(మేల్ అండ్ ఫిమేల్): 05
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 03, ఎస్సీ- 01, ఎస్టీ- 01.
➥ ఏఆర్(మేల్ అండ్ ఫిమేల్): 35
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 16, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 09, ఎస్సీ- 05, ఎస్టీ- 02.
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్, నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.08.2024 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.
పే స్కేల్: అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)- (స్టెనోగ్రాఫర్/ కంబాటెంట్ స్టెనోగ్రాఫర్) అండ్ వారెంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్): రూ.29200-92300. హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) (మినిస్టీరియల్/ కంబాటెంట్ మినిస్టీరియల్) అండ్ హవల్దార్ (క్లర్క్): రూ.25500-81100.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.06.2024.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.07.2024.