అన్వేషించండి

ARO: 'అగ్నివీరుల' నియామకానికి ఏఆర్‌వో-విశాఖపట్నం నోటిఫికేషన్ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 'అగ్నిపథ్' స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

INDIAN ARMY RECRUITMENT: విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 'అగ్నిపథ్' స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. దరఖాస్తుల సమర్పణకు మార్చి 22 వరకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టులు నిర్వహించి తుదిఎంపిక చేస్తారు. ఎంపికైనవారు నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, యానాం (యూటీ పుదుచ్చేరి) జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు. 

వివరాలు...

* అగ్నివీరుల నియామకం

కేటగిరీలు:

➥ అగ్నివీర్ జనరల్ డ్యూటీ 

➥ అగ్నివీర్ టెక్నికల్ 

విభాగాలు: మెకానిక్ మోటార్ వెహికిల్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాట్స్‌మ్యాన్, సర్వేయర్, జియో ఇన్‌ఫర్మాటిక్స్ అసిస్టెంట్, ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఐటీ, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, వెసల్ నేవిగేటర్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఆటోమోబైల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ.  

➥ అగ్నివీర్ ఆఫీస్‌ అసిస్టెంట్‌/ స్టోర్ కీపర్ టెక్నికల్ 

➥ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్

➥ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్

అర్హతలు: 

⫸ అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి.

⫸ అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

⫸ అగ్నివీర్ ఆఫీస్‌ అసిస్టెంట్‌/ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

⫸ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

⫸ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థలు 01.10.2003 నుంచి 01.04.2007 మధ్య జన్మించి ఉండాలి.

శారీరక ప్రమాణాలు: ఎత్తు: అగ్నివీర్ జీడీ/ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు 166 సెం.మీ, అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు 165 సెం.మీ, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు 162 సెం.మీ. ఉండాలి. ఇక ఛాతీ కొలత గాలి పీల్చినపుడు 5 సెం.మీ విస్తరణతో 77 సెం.మీ. ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు: ఎంపికైనవారు కచ్చితంగా నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000, మూడో సంవత్సరం నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 చొప్పున ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం. నాలుగేళ్లు సర్వీసు తర్వాత 'సేవా నిధి ప్యాకేజీ' కింద రూ.10.04 లక్షలు ఇస్తారు.  

ముఖ్యమైన తేదీలు… 

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13.02.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 22.03.2024.

➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22.04.2024.

Notification

Online Application

Website 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget