News
News
X

APPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, 'ఆప్షన్లు' నమోదు చేసుకోండి! షెడ్యూలు ఇదే!

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 'ఆప్షన్లు' నమోదు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. మార్చి 6 నుంచి 15 వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 'ఆప్షన్లు' నమోదు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. మార్చి 6 నుంచి 15 వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ల నమోదులో భాగంగా అభ్యర్థులు తాము పరీక్ష రాసే మీడియం, పోస్టుల ప్రాధాన్యత క్రమం, జోనల్ ప్రిఫరెన్స్, పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసిన అభ్యర్థులను మాత్రమే మెయిన్ పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీలను ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం సెషన్లలోనే పరీక్షలు నిర్వహిస్తారు. ఇటీవల వెల్లడించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో మొత్తం 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మల్టీ జోన్‌, రిజర్వేషన్‌ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. 

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ఇలా..
మెయిన్ పరీక్షలో మొత్తం 5 పేపర్లు ఉంటాయి. మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో పేపరుకు 150 మార్కుల కేటాయించారు. మొత్తం 5 పేపర్లకు గాను 750 మార్కులు, పర్సనాలిటీ టెస్టుకు 75 మార్కులు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలను కేవలం అర్హత పరీక్షలుగానే పరిగణిస్తారు. వీటిమార్కులను మెయిన్స్ పరీక్ష మార్కుల్లో కలపరు. 

➥ ఏప్రిల్ 23: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు

➥ ఏప్రిల్ 24: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు

➥ ఏప్రిల్ 25: పేపర్-1 జనరల్ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన సమస్యలు: 150 మార్కులు

➥ ఏప్రిల్ 26: పేపర్-2 (హిస్టరీ & కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు

➥ ఏప్రిల్ 27: పేపర్-3 (పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు.

➥ ఏప్రిల్ 28: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు

➥ ఏప్రిల్ 29: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ఇలా..
మెయిన్ పరీక్షలో మొత్తం 5 పేపర్లు ఉంటాయి. మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో పేపరుకు 150 మార్కుల కేటాయించారు. మొత్తం 5 పేపర్లకు గాను 750 మార్కులు, పర్సనాలిటీ టెస్టుకు 75 మార్కులు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలను కేవలం అర్హత పరీక్షలుగానే పరిగణిస్తారు. వీటిమార్కులను మెయిన్స్ పరీక్ష మార్కుల్లో కలపరు. 

➥ ఏప్రిల్ 23: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు

➥ ఏప్రిల్ 24: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు

➥ ఏప్రిల్ 25: పేపర్-1 జనరల్ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన సమస్యలు: 150 మార్కులు

ఏప్రిల్ 26: పేపర్-2 (హిస్టరీ & కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు

➥ ఏప్రిల్ 27: పేపర్-3 (పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు.

ఏప్రిల్ 28: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు

➥ ఏప్రిల్ 29: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు

పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...

ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో నుంచి 1:50 నిష్పత్తిలో 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

Published at : 05 Mar 2023 11:01 PM (IST) Tags: APPSC Group1 Recruitment APPSC Group1 Mains Exam Schedule APPSC Group1 Mains Exam Dates Group1 Mains Options Group1 Mains Web Options

సంబంధిత కథనాలు

SSC Selection Posts: 5369 సెలక్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

SSC Selection Posts: 5369 సెలక్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!

IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SAIL Recruitment: బొకారో స్టీల్ ప్లాంటులో 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అర్హతలివే!

SAIL Recruitment: బొకారో స్టీల్ ప్లాంటులో 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అర్హతలివే!

NCDIR: ఎన్‌సీడీఐఆర్‌‌లో 16 ఉద్యోగాలు- అర్హతలు ఇవే! దరఖాస్తుచేసుకోండి!

NCDIR: ఎన్‌సీడీఐఆర్‌‌లో 16 ఉద్యోగాలు- అర్హతలు ఇవే! దరఖాస్తుచేసుకోండి!

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!