అన్వేషించండి

APSLPRB: ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - షెడ్యూలు ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూలు పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఈ మేరకు ఆగస్టు 11న అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూలు పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఈ మేరకు ఆగస్టు 11న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

ఫిజికల్ ఈవెంట్ల కోసం విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులో వేదికలు ఏర్పాటు చేసినట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌ లెటర్లను ఆగస్టు 14 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట స్టేజ్‌-2 అప్లికేషన్‌ ఫాం తెచ్చుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. 

ఏపీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. 

ఫిజికల్ ఈవెంట్ల కేంద్రాలు..

➥ విశాఖపట్నంలో కేంద్రంలో మొత్తం 17,371 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీరిలో 14,626 మంది పురుషులు, 2745 మంది మహిళలు ఉన్నారు. 

➥ ఏలూరు కేంద్రంలో మొత్తం 9,685 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీరిలో 8,246 మంది పురుషులు, 1439 మంది మహిళలు ఉన్నారు.

➥ గుంటూరు కేంద్రంలో మొత్తం 12,956 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీరిలో 11,047 మంది పురుషులు, 1909 మంది మహిళలు ఉన్నారు.

➥ కర్నూలు కేంద్రంలో మొత్తం 16,104 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీరిలో 14,007 మంది పురుషులు, 2097 మంది మహిళలు ఉన్నారు.

🔰 ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

APSLPRB: ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - షెడ్యూలు ఇదే!

APSLPRB: ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - షెడ్యూలు ఇదే!

ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించినవారికి ధ్రువపత్రాల పరిశీలన, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు..

* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు 

ఖాళీల సంఖ్య: 411

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జోన్ జిల్లా/ఏరియా పోస్టులు
జోన్-1 (విశాఖపట్నం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 50
జోన్-2 (ఏలూరు) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 105
జోన్-3 (గుంటూరు) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55
జోన్-4 (కర్నూలు) చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప 105
  మొత్తం  315

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  24
రాజమహేంద్రవరం 24
మద్దిపాడు - ప్రకాశం  24
చిత్తూరు 24
మొత్తం 96

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget