అన్వేషించండి

AP Mega DSC Mock Tests: 5 లక్షలు దాటిన ఏపీ మెగా డీఎస్సీ అప్లికేషన్లు- మాక్ టెస్టులు, హాల్ టికెట్లపై అప్‌డేట్స్

AP Mega DSC Notificication | ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ల దరఖాస్తులకు గడువు ముగిసింది. మొత్తం 5 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి.

AP Mega DSC Jobs 2025 | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ  నోటిఫికేషన్‌కు భారీగా స్పందన లభించింది. మొత్తం 3 లక్షల 35 వేల 401 మంది అభ్యర్థులు మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దరఖాస్తు గడువు ముగిసింది. మెగా డిఎస్పీలో 16,347 పోస్టులను ఏపి ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మొత్తం పోస్టులకుగానూ 5 లక్షల 77 వేల 417 అప్లికేషన్లు వచ్చాయి. 

ఇతర రాష్ట్రాల నుంచి 7159 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి 15వేల ఎనిమిది వందల పన్నెండు మంది అభ్యర్థులు డిఎస్సి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. మే నెలాఖరు నుంచి హాల్ టికెట్లు జారీ చేయాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జూన్ 6న ప్రారంభం కానున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూలై ఆరో తేదీన ముగియనున్నాయి.

 

 

జిల్లా పేరు

అభ్యర్థులు

దరఖాస్తులు
1

శ్రీకాకుళం

22,648

39,235
2 విజయనగరం 18,001  31,038
3 విశాఖపట్నం  29,779  49,658
4 తూర్పు గోదావరి  38,617  63,004
5 పశ్చిమ గోదావరి  25,750   42,466
6 కృష్ణా  19,953   35,220
7 గుంటూరు   25,067   43,570
8 ప్రకాశం  21,046   35,095
9 నెల్లూరు   15,993   28,772
10 చిత్తూరు    26,501    45,221
11 కడప    15,812  29,915
12 కర్నూలు    39,997    73,605
13 అనంతపురం    29,078    50,475
14 ఇతర రాష్ట్రాల వారు  7,159     10,143

మే 20 నుంచి మెగా డీఎస్సీ అభ్యర్థులకు మాక్‌ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. మే 30 నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల చేయనుంది విద్యాశాఖ. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుంది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజుల తర్వాత ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్‌ కీ విడుదల చేస్తారు. ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత ఏపీ డీఎస్సీ ఫలితాలు మెరిట్ జాబితా విడుదల చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేట్ వెరిఫికేసన్ ప్రక్రియ పూర్తిచేసి, రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులకుగానూ అభ్యర్థుల తుది ఎంపిక పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Makar Sankranti:మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
Embed widget