అన్వేషించండి

AP Mega DSC 2024: ఏపీలో డీఎస్సీ-2024 నోటిఫికేషన్ రద్దు, త్వరలో 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్ - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

AP DSC 2024: ఏపీలో గత ప్రభుత్వ వెల్లడించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. 16,347 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

AP DSC 2024 Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 6,100 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం (జూన్ 13) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా చంద్రబాబు అధికార పట్టాలు చేపట్టగానే 16,347 ఉద్యోగాలకు సంబంధించిన 'మెగా డీఎస్సీ'దస్త్రంపై తొలి సంతకం పెట్టారు. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది అభ్యర్థులు మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మాత్రం అవకాశం కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.

కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ జూన్ 13న అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.  దీంతో డీఎస్సీ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియ 6 నెలల్లోపే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది.

AP Mega DSC 2024: ఏపీలో డీఎస్సీ-2024 నోటిఫికేషన్ రద్దు, త్వరలో 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్ - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు ఇలా.. 
గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా పాఠశాల విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిప్రకారం.. 16347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.

కొత్త నోటిఫికేషన్ ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు.

మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు..

క్ర.సం. విభాగం పోస్టుల సంఖ్య
1) స్కూల్ అసిస్టెంట్ (SA) 7725
2) సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) 6371
3) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) 1781
4) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) 286 
5) ప్రిన్సిపల్స్ 52
6) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) 132
- మొత్తం ఖాళీలు 16,347

ఏపీలో 6100 టీచర్ పోస్టులతో ఫిబ్రవరి 12న డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.  4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు.  వీటిలో ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ నోటిఫికేషన్‌లో గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది.

ALSO READ:

➥ 'డీఎస్సీ' అభ్యర్థులకు అలర్ట్, 'టెట్' మార్కుల నమోదుకు, దరఖాస్తుల సవరణకు అవకాశం 

తెలంగాణ టెట్-2024 తుది ఆన్సర్ 'కీ' విడుదల

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget