అన్వేషించండి

AP DSC 2024: నేడు ఏపీ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 15 నుంచి ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ మార్చి 9న వెల్లడించనుంది.

AP DSC Hall Ticket 2024: ఆంధ్రప్రదేశ్‌లో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 15 నుంచి ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ మార్చి 9న వెల్లడించనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5 నుంచే హాల్‌టికెట్లు అందుబాటులోకి రావాల్సి ఉండగా వాయిదా పడింది. డీఎస్సీ పరీక్షలకు సుమారు 3 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్) పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తదనంతరం ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఏపీ డీఎస్సీ 2024 హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. 

➥ ఏపీ డీఎస్సీ 2024 హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి -apdsc.apcfss.in.

➥ అక్కడ హోంపేజీలో AP DSC 2024 Halltickets లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు నమోదుచేసి 'Submit' బటన్ మీద క్లిక్ చేయాలి.

➥ కంప్యూటర్ స్క్రీన్ మీద డీఎస్సీ పరీక్ష హాల్‌టికెట్లు దర్శనమిస్తాయి.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

➥ ప్రింట్ తీసుకొని పరీక్షలకు హాజరయ్యే రోజు తీసుకెళ్లాలి.

➥ హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Website

టెట్, డీఎస్సీ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు..
ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. మార్చ్ 15 వ తేది నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14 వ తేదీన వస్తున్నాయని, మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్ లో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జవ్వాజి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాదుల వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget