![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP High Court Jobs: హైకోర్టులో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు.
![AP High Court Jobs: హైకోర్టులో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అర్హతలివే! Andhra Pradesh High Court Has Released Notification for the recruitment of Office Subordinate Posts AP High Court Jobs: హైకోర్టులో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అర్హతలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/a6f46255bb18823d14ef072bbbb15b001666490382031522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు. ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 29 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 135.
అర్హత: 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు. ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
జీతం: రూ.20,000 - రూ.61,960.
రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కోప్రశ్నలకు ఒకమార్కు ఉంటుంది. వీటిలో జనరల్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-30 ప్రశ్నలు-30 మార్కులు, మెంటల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో కటాఫ్ మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:15.11.2012.
:: ఇవీ చదవండి ::
హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్లు, త్వరలోనే పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు: జగన్
హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్ కల్పించడానికి శ్రీకారం చుడుతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం పోలీస్ శాఖలోనే 16వేల మహిళా పోలీసులను నియమించినట్లు చెప్పారు. దిశ యాప్, దిశా పోలీస్టే స్టేషన్లు, ప్రాసిక్యూటర్లను ప్రతి నియమించామని చెప్పిన సీఎం జగన్.. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలని సందేశం ఇచ్చారు. ఇప్పటిదాకా 1.33 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని, పోలీస్ శాఖలోనే 16వేల మంది మహిళా పోలీసులను నియమించామని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)