AIIMS: ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
రాయ్‌బరేలిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాయ్‌బరేలిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 40
కేటగిరీల వారీగా ఖాళీలు: యూఆర్: 19; ఓబీసీ: 10; ఎస్సీ: 05; ఎస్టీ: 03; ఈడబ్ల్యఎస్: 03.
* జూనియర్ రెసిడెంట్ పోస్టులు.
అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 37 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పని అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పే స్కేల్స్: నెలకు రూ.56,100.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.08.2023.
➥ రాత పరీక్ష తేదీ: 20.08.2023.
ALSO READ:
TS TET - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 16 వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15న కంప్యూటర్ ఆధారిత విధానంలో 'టెట్' పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. టెట్-2023కు సంబంధించి పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అర్హత ఉన్నవారు రాయడానికి అర్హులు. అదేవిధంగా బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివుతున్నవారు కూడా టెట్ రాయడానికి అర్హులే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో 70 గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్‌పీఎల్) గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 55శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా,డిగ్రీ 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో 105 ట్రాలీ రిట్రీవర్ పోస్టులు
చెన్నైలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(ఏఏఐ సీఎల్‌ఏఎస్) ట్రాలీ రిట్రీవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 105 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 02వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

