AIIMS: ఎయిమ్స్-నాగ్‌పుర్‌లో 68 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పుర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నాగ్‌పుర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 68 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
వివరాలు..
* నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 68.
➥ మెడికల్ ఫిజిసిస్ట్: 02
➥ క్లినికల్ సైకాలజిస్ట్: 01
➥ మెడికల్ ఆఫీసర్ (ఆయుష్): 01
➥ యోగా ఇన్‌స్ట్రక్టర్:01
➥ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 02
➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 04
➥ స్టోర్ కీపర్: 04
➥ జూనియర్ ఇంజినీర్ (ఏసీ & రిఫ్రిజిరేటర్): 01
➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్): 01
➥ జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01
➥ జూనియర్ ఫిజియోథెరపిస్ట్: 01
➥ జూనియర్ ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్: 02
➥ లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్: 01
➥ ఆప్టొమెట్రిస్ట్: 02
➥ టెక్నీషియన్ (ల్యాబొరేటరీ): 16
➥ టెక్నీషియన్ (రేడియోలజీ): 02
➥ ఫార్మసిస్ట్: 05
➥ ఫైర్ టెక్నీషియన్: 02
➥ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్: 02
➥ స్టెనోగ్రాఫర్: 04
➥ లాండ్రీ సూపర్‌వైజర్: 01
➥ జూనియర్ వార్డెన్: 02
➥ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (LDC): 10
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ పీజీ డిగ్రీ/ ఎంఏ/ పీజీ డిప్లొమా/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీలకు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ALSO READ:
సీడ్యాక్‌లో 277 ప్రాజెక్ట్ పోస్టులు, వివరాలు ఇలా
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) పలు ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 277 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..