By: ABP Desam | Updated at : 03 Oct 2023 07:31 AM (IST)
Edited By: omeprakash
ఎయిమ్స్ నాగ్‌పూర్ ఉద్యోగాలు
నాగ్‌పుర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 32 ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 12లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 32
1) ప్రొఫెసర్: 10 పోస్టులు
2) అడిషనల్ ప్రొఫెసర్: 12 పోస్టులు
3) అసోసియేట్ ప్రొఫెసర్: 06 పోస్టులు
4) అసిస్టెంట్ ప్రొఫెసర్: 14 పోస్టులు
విభాగాలు: అనస్తేషియాలజీ, బయోస్టాటిస్టిక్స్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ & మెటబాలిజం, ఈఎన్‌టీ, గ్యాస్రోఎంట్రాలజీ (మెడికల్), హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ హెమటాలజీ, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, సైకియాట్రీ, పల్మొనరీ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్రోఎంట్రాలజీ, ట్రాన్స్‌ఫ్యూజియన్ మెడిసిన్, యూరాలజీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంఎస్/ ఎండీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 1-14 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 - 58 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు-ప్రభుత్వ ఉద్యోగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.2,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.
జీతభత్యాలు: నెలకు రూ.1,01,500 - రూ.2,20,400 చెల్లిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Executive Director,
AIIMS Nagpur, Administrative Block,
Plot no.2, Sector -20, MIHAN,
Nagpur – 441108.
దరఖాస్తు చివరితేది: 12.10.2023.
ALSO READ:
వ్యాప్‌కోస్ లిమిటెడ్‌లో 140 కంట్రోల్ ఇంజినీర్ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్ లిమిటెడ్ సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్, ఫీల్డ్ క్వాలిటీ అసూరెన్స్ అండ్ కంట్రోల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాలకు డీన్, యూనివర్సిటీ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు/ఆసుపత్రుల్లో 1038 పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రీజియన్‌లో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి
గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?
Civil Services: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు ఎంపిక!
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
TS GENCO: జెన్కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ
/body>