Brain Tumour: ఆ నొప్పిని లైట్ తీసుకోవద్దు, అది మెదడువాపు వ్యాధి ప్రధాన లక్షణం, వీళ్లకే ఎక్కువ ఛాన్స్!
ఈ నొప్పి అందరిలో సాధారణమే. కానీ, అది కాస్త ఎక్కువగా వస్తుంటే మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే, అది మెదడు వాపు ముప్పును మరింత తీవ్రతరం చేస్తుంది.
Brain Tumour | మెదడు వాపు వ్యాధి.. దీన్ని వెంటనే గుర్తించడం కష్టమే. బాగా ముదిరిన తర్వాతే దీని లక్షణాలు బయటపడతాయి. అయితే, కొన్ని సంకేతాల ద్వారా ఈ వ్యాధిని ముందే పసిగట్టవచ్చు. అయితే, అది చాలామందిలో సాధారణంగా కనిపించే లక్షణం. ఫలితంగా మెదడు వాపు వ్యాధిని గుర్తించలేక జీవితాలను కోల్పోతున్నారు. కాబట్టి.. ఈ వివరాలు తెలుసుకుని మీరైనా జాగ్రత్తగా ఉండండి. ఈ కథనాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేసుకుని ప్రాణాలు రక్షించండి.
మెదడు వాపు లేదా బ్రెయిన్ ట్యూమర్(brain tumour) అంటే ఏమిటి?
మెదడు వాపునే బ్రెయిన్ ట్యూమర్ అని కూడా అంటారు. మెదడులో ఏర్పడే చిన్న కణితి వల్ల మెదడులోకి కణాలు నియంత్రించలేని విధంగా విభజనకు గురవ్వుతాయి. దాని వల్ల వాపు లేదా గడ్డ ఏర్పడుతుంది. అది క్రమేనా మెదడు మొత్తం వ్యాపిస్తుంది. అయితే, ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. ముందుగా గుర్తిస్తే చికిత్సతో నియంత్రించవచ్చు. ఈ కణితులు మెదడులోనే వ్యాపిస్తాయని అనుకుంటే పొరపాటే.. శరీరంలో ఇతర చోట్ల ఏర్పడే క్యాన్సర్ కణాలు మెదడుకు వ్యాపించినా ఈ ముప్పు ఏర్పడుతుంది. మెదడు కణితులను వాటి తీవ్రతను ఆధారంగా వర్గీకరించారు. గ్రేడ్-1, 2 కణితులు తక్కువ ప్రమాదంగా పరిగణిస్తున్నారు. గ్రేడ్-3, 4 కణితలను అత్యంత ప్రమాదకరం. గ్రేడ్ -1, 2 కణితులను చికిత్సతో నయం చేయొచ్చు. కానీ, గ్రేడ్-3, 4 చికిత్స తర్వాత కూడా మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.
బ్రెయిన్ ట్యూమర్(brain tumour) లక్షణాలు ఏమిటి?
మెదడు వాపు(brain tumour) లక్షణాలు దాని తీవ్రత, మెదడులోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. వీటిని ముందుగానే పసిగట్టవచ్చు. ముఖ్యంగా తలనొప్పిని మనం చాలా లైట్‌గా తీసుకుంటాం. కానీ, అది మెదడు వాపును సూచించే ప్రధాన లక్షణం. తలనొప్పితోపాటు మూర్ఛ, వికారం, వాంతులు, మగతగా ఉన్నట్లయితే తప్పకుండా అనుమానించాలి. వైద్యుడిని సంప్రదించాలి.
☀ కొందరికి తలనొప్పి ఆగకుండా వస్తుంటుంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గదు. అలాంటి వారు తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
☀ దృష్టి(చూపు) మసకబారినా, మాట మందంగా వస్తున్నా, పక్షవాతం వంటివి ఏర్పడినా.. మెదడువాపుగా సందేహించాలి.
☀ ఈ లక్షణాలు కొందరిలో అకస్మాత్తుగా కనిపిస్తాయి. లేదా కాలక్రమేణా నెమ్మదిగా బయటపడతాయి.
బ్రెయిన్ ట్యూమర్(brain tumour) వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
మెదడు వాపు వ్యాధి(brain tumour) ఎవరికైనా రావచ్చు. అయితే, క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు, వృద్ధులు లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా మెదడు వాపు ఉన్నా.. ముప్పు తప్పదు. అలాగే, HIV/AIDS బాధితుల్లో కూడా మెదడులో కణితులు ఏర్పడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అధిక రేడియేషన్‌కు గురయ్యే వ్యక్తులకు కూడా మెదడు వాపు వ్యాధి ఏర్పడవచ్చు.
Also Read: అద్భుతం, ఈ డైట్‌తో 3 నెలల్లోనే డయాబెటిస్ మాయం, 70 శాతం మంది సక్సెస్!
చికిత్స ఉందా? ఏం చేస్తారు?
మెదడు వాపు(brain tumour) వ్యాధికి చికిత్స ఉంది. అయితే, దాని తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక దశలోనే మెదడు వాపును గుర్తిస్తే.. స్టెరాయిడ్స్ ద్వారా కణితి చుట్టూ ఉండే వాపును తగ్గిస్తారు. కణితిని తొలగిస్తేనే బాధితుడు బతుకుతాడని గుర్తిస్తే.. సర్జరీ చేస్తారు. కొందరికి కిమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా కూడా చికిత్స అందిస్తారు. పరిస్థితి అంతవరకు తెచ్చుకోకూడదంటే.. తీవ్రమైన తలనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.
Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!