By: Haritha | Updated at : 13 Mar 2023 08:52 AM (IST)
(Image credit: Pixabay)
జెస్టేషనల్ డయాబెటిస్ గర్భిణీలలో కనిపించే మధుమేహం. టైప్1 మధుమేహం, టైప్2 మధుమేహం ఎలాగో... అలాంటి మరో రకమే జెస్టిషనల్ డయాబెటిస్ కూడా.ఇది కేవలం గర్భం ధరించిన సమయాల్లోనే కనిపిస్తుంది. ప్రసవం అయ్యాక చాలామందిలో ఈ మధుమేహం పోతుంది, కానీ కొందరిలో మాత్రం అలా కంటిన్యూ అయిపోతుంది. ఒకసారి గర్భం ధరించాక జెస్టిషనల్ డయాబెటిస్ వచ్చిందంటే వారికి భవిష్యత్తులో మళ్ళీ వచ్చే అవకాశం ఉందని అర్.థం అందుకే ఈ డయాబెటిస్ బారిన పడిన స్త్రీలు ఆహార విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.
గర్భధారణలో మధుమేహం అనేది సాధారణ గర్భధారణ సమస్య గానే చూస్తారు. వైద్యులు చెబుతున్న ప్రకారం ఇది కొంతమందిలో ప్రసూతి సంబంధ సమస్యలను పెంచుతుంది. తల్లికి గుండె జబ్బులు, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే పుట్టే పిల్లల్లో రక్తపోటు, ఊబకాయం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఎక్కువ కాంతికి గురైతే...
అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రాత్రి నిద్ర పోయే ముందు గర్భిణులు ఎక్కువ కాంతిని చూడడం వల్ల మధుమేహం వచ్చే సమస్య పెరుగుతుందని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా 741 మంది గర్భిణీలను పరీక్షించారు. వీరిలో ఎవరైతే నిద్రకు ముందు ఎక్కువ కాంతికి బహిర్గతం అవుతారో, వారిలో మధుమేహం వచ్చినట్టు తేలింది. ప్రీ-స్లీప్ లైట్ ఎక్స్పోజర్ (నిద్రపోయే ముందు కాంతికి గురవ్వడం) అనేది శరీరంలో గ్లూకోజ్ ఓవర్ యాక్టివిటీని ప్రేరేపిస్తుందని, తద్వారా జీవక్రియను ప్రభావితం చేస్తుందని తేలింది. నిద్రకు ముందు హృదయ స్పందన రేటు కాస్త తగ్గుతుంది. ఆ సమయంలో గ్లూకోస్ అధికంగా పనిచేస్తుంది. అందుకే నిద్రపోయే ముందు గర్భిణులు ఫోన్లు, టీవీలు వంటివి చూడడం మంచిది కాదు. లైట్లు కూడా గదిలో ఆపి వేసుకోవడం మంచిది. మీరు పడుకోవడానికి ముందు మూడు గంటల్లో మీ చుట్టూ ఉన్న వాతావరణం లో ఉన్న కాంతిని తగ్గించడానికి ప్రయత్నించాలి.
ఫోన్లు చూడాల్సి వస్తే ఎక్కువ కాంతి లేకుండా డిమ్ గా పెట్టుకొని చూసుకోవాలి. ఫోన్ చూడడం పూర్తయిన తర్వాత మీ మంచానికి దూరంగా ఫోన్లు పెట్టాలి. ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ తరంగాలు మీ ఆరోగ్యం పైనా, బిడ్డ ఆరోగ్యం పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫోన్లు వాడడం తగ్గించుకుంటనే మంచిది. అధిక రేడియేషన్ వల్ల న్యూరల్ ట్యూబ్ సమస్యలు రావచ్చు.
Also read: గుండెపోటు వచ్చే ముందు కనిపించే సంకేతాలలో వీటిని తేలిగ్గా తీసుకోకండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Red Food Colour: ఎరుపు రంగు ఫుడ్ కలర్ వాడుతున్నారా? అది దేనితో తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు
High Cholesterol: కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే
నిజామాబాద్ జిల్లాకు గోల్డ్ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం
Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!
World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక
BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?
BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే