అన్వేషించండి

Coronavirus Updates: 30 వేల దిగువకు కరోనా కేసులు.. 4 నెలల్లో ఇదే తొలిసారి

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 29,689 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్​ కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4 లక్షల 21 వేలు దాటింది.

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. కొత్త కేసులు 30వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. దాదాపు నాలుగు నెలల తర్వాత కేసులు ఈ స్థాయిలో క్షీణించాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. మరణాల సంఖ్య కూడా 400 సమీపానికి దిగివచ్చిందని పేర్కొంది. 

  1. తాజాగా 17,20,110 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..29,689 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.14కోట్లకు చేరాయి. 
  2. నిన్న మరో 415 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 4,21,382 మంది మహమ్మారికి బలయ్యారు. 
  3. ఇక నిన్న 42,363 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా..మొత్తంమీద 3.06కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. 
  4. క్రియాశీల కేసులు 4లక్షల దిగువకు క్షీణించాయి. ప్రస్తుతం 3,98,100 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.27 శాతానికి తగ్గింది.
  5. తాజాగా 66,03,112 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. దాంతో టీకా డోసుల పంపిణీ 44 కోట్ల మార్కును దాటింది.   

దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 40వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.

భారత్‌లో ఇప్పటికే మూడింట రెండు వంతుల జనాభాలో యాంటీబాడీలు ఉన్నాయని సీరమ్ సర్వేలో వెల్లడైన విషయంపై డా.గులేరియా స్పందించారు. ఇప్పటికీ ఒక వంతు జనాభా వైరస్ రిస్క్‌ను ఎదుర్కొంటోందన్న విషయాన్ని ప్రస్తావించారు. యాంటీబాడీలకు సంబంధించి రెండు అంశాలను పేర్కొన్నారు. ఒకటి... శరీరంలో 'X' స్థాయిలో యాంటీబాడీలు ఉంటే రీఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉంటారని చెప్పేందుకు ఎటువంటి అవకాశం లేదన్నారు. రెండవది... వైరస్ బారినపడి కోలుకున్నవారిలో క్రమంగా యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతుందన్నారు. అయితే వ్యాక్సినేషన్ పెరగడం మంచి పరిణామని... థర్డ్ వేవ్ మరీ అంత ఆందోళనకరంగా ఉండకపోవచ్చునని అన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాచించకుండా లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు లైట్ తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్ ప్రమాదకరంగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. కనుక ప్రజలు నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Monsoon Stomach Infection: వర్షాకాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి
వర్షాకాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి
NPPA New Drug Prices: అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget