News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Corona New Variant : భారత్‌లో మరో కొత్తరకం వేరియంట్ - కొత్త వైరస్‌ను కనిపెట్టిన డబ్ల్యూహెచ్‌వో !

భారత్‌లో కొత్త రకం కరోనా వేరియంట్‌ను కనిపెట్టినట్లుగా ప్రపంచఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఎంత ప్రమాదకరం అనేదానిపై పరిశోధనలు చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

Corona New Variant :    భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బిఎ.2కి ఉపరకమైన కొత్త సబ్‌ వేరియంట్‌ బిఎ.2.75ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) తెలిపింది. బిఎ.2.75 లక్షణాలను విశ్లేషిస్తున్నామని పేర్కొంది. గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య 30 శాతం పెరిగింది. డబ్ల్యుహెచ్‌ఒకు చెందిన ఆరు సబ్‌రీజియన్‌లలో నాలుగు ప్రాంతాల్లో గతవారంలో కేసులు పెరిగాయని డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ అధ్నామ్‌ గాబ్రియేస్‌ పేర్కొన్నారు. 

ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఇండియా సంతతి వ్యక్తి- రిషి సునక్ ఎవరో తెలుసా?

యూరప్ అమెరికాల్లో పెరుగుతున్న బిఎ.4, బిఎ.5 వేరియంట్‌లు

యూరప్‌, అమెరికాల్లో బిఎ.4, బిఎ.5 వేరియంట్‌లు వ్యాప్తి చెందుతున్నాయని, భారత్‌ వంటి దేశాల్లో కొత్త సబ్‌ వేరియంట్‌ బిఎ..75 వ్యాప్తిని గుర్తించామని అన్నారు. పరిమిత స్థాయిలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ జరుగుతుండటంతో విశ్లేషణకు పూర్తి సమాచారం అందుబాటులో లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గతవారం4.6 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పొలిస్తే మరణాలు 12 శాతం మేర తగ్గాయని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది.

ప్రభుత్వమే రేట్లు పెంచుతూంటే ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుంది ? ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయా ?

ప్రపంచంలోనే మొదటి సారిగా బిఎ.2.75  ఇండియాలో గుర్తింపు

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌పై డబ్ల్యు హెచ్‌ఒ శాస్త్రవేత్త సౌమ్యాస్వామినాథన్‌ మాట్లాడుతూ.. బిఎ.2.75 అని పిలిచే ఉప వేరియంట్‌ను భారత దేశంలో మొదట గుర్తించామని, అనంతరం 100 దేశాల్లో గుర్తించామని అన్నారు. ఈ వేరియంట్‌పై పరిమిత సమాచారం అందుబాటులో ఉందని చెప్పారు. ఈ ఉప వేరియంట్‌ స్పైక్‌ ప్రోటీన్‌, రిసెప్టర్‌ బైండింగ్‌ కొన్ని ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఈ సబ్‌ వేరియంట్‌ మానవ రోగనిరోధక శక్తిపై ఎలా దాడి చేస్తుందో అనే అంశంపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు.

దిల్లీ ప్రజలు ఆశ్చర్యపోతారు, సెంట్రల్ విస్తా అద్భుతంగా ఉంది-కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్

కొత్త వైరస్‌లు ఎంత ప్రమాదకరమో ఇంకా పరిశోధనలు

ప్రపంచంలో ఇప్పటికే పలు దేశఆల్లో కొత్త కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. అయితే అవీ కూడా ప్రమాదకరమైన వేరియంట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం లేదు. కరోనా కేసులు అప్పుడప్పుడూ పెరుగుతున్నాయి.. తరచూ తగ్గుతున్నాయి. ఈ కారణంగా కరోనా వేరియంట్లను పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. 

Published at : 07 Jul 2022 07:39 PM (IST) Tags: Corona WHO World Health Organization Corona variant

ఇవి కూడా చూడండి

Nipah Virus: కరోనా కంటే నిఫా డేంజర్‌- మరణాల రేటు 40 - 70 శాతం వరకు ఉండొచ్చు: ICMR వార్నింగ్

Nipah Virus: కరోనా కంటే నిఫా డేంజర్‌- మరణాల రేటు 40 - 70 శాతం వరకు ఉండొచ్చు: ICMR వార్నింగ్

Covid New Variant: మొన్న ఎరిస్, తాజాగా పిరోలా- ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్

Covid New Variant: మొన్న ఎరిస్, తాజాగా పిరోలా- ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్

Long Covid Effects: షాకింగ్, నీలం రంగులోకి మారిపోతున్న కోవిడ్ రోగుల కాళ్లు - కేవలం వారికి మాత్రమే!

Long Covid Effects: షాకింగ్, నీలం రంగులోకి మారిపోతున్న కోవిడ్ రోగుల కాళ్లు - కేవలం వారికి మాత్రమే!

Covid: ఖతర్నాక్ కరోనా - లంగ్స్ మాత్రమే కాదు, ఈ అవయవాలనూ చిద్రం చేస్తుందట!

Covid: ఖతర్నాక్ కరోనా - లంగ్స్ మాత్రమే కాదు, ఈ అవయవాలనూ చిద్రం చేస్తుందట!

Corona New Variant: విజృంభిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ 'Eris'- లక్షణాలు ఎలా ఉంటాయంటే?

Corona New Variant: విజృంభిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ 'Eris'- లక్షణాలు ఎలా ఉంటాయంటే?

టాప్ స్టోరీస్

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?