అన్వేషించండి

ICMR: ఇంతకీ వ్యాక్సిన్ తీసుకుంటే ఫలితం ఉందా? ఐసీఎంఆర్ ఏం చెప్పింది?

కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే.. ఫలితం ఉందా? టీకాలు వేసుకున్నవారికి కరోనా వచ్చాక ఎలా ఉంది? ఈ విషయంపై ఐసీఎంఆర్ ఏం చెబుతోంది?

వ్యాక్సిన్ వేసుకున్నాక.. కరోనా వస్తుందా? రాదా? వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? అని చాలామందికి అనుమానాలు. వ్యాక్సిన్ వేసుకున్నా ఎలాంటి ఫలితం లేదని విశ్లేషణలు కొందరివి. కానీ వ్యాక్సిన్ తీసుకున్న వారి పరిస్థితి.. బెటర్ అని చెబుతోంది ఐసీఎంఆర్.

ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు మంచి పనితీరు చూపాయని ఐసీఎంఆర్ అంటోంది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్  ఓ అధ్యయనం చేసింది. కొవిడ్ సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్న సమయంలో చేసిన ఈ అధ్యయనం దేశంలో మెుదటిది. అంతేకాదు అతిపెద్దది కూడా. దేశవ్యాప్తంగా మెుత్తం 677 కొవిడ్ పాజిటివ్ వ్యక్తులపై దీన్ని నిర్వహించగా.. 80 శాతం మందికిపైగా డెల్టా వేరియంట్ బారిన పడ్డారని అధ్యయనంలో తెలిసింది. అయితే వారు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొలేదని చెబుతోంది.

ఐసీఎంఆర్ చెప్పిన విషయాలు..

  1. ఇప్పటికే ఒకటి లేదా రెండు డోసుల టీకా తీసుకున్న వారు.. కొవిడ్ బారిన పడిన వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. వారి నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించింది.
  2. వైరస్ సోకిన 677 మంది నమూనాలను విశ్లేషించగా. అందులో 86.09 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ ఉందని తెలిసింది.
  3. ఆ మెుత్తం కేసుల్లో 9.8 శాతం మంది ఆసుపత్రిలో మాత్రమే ఆసుపత్రిలో చేరారు. 0.4 శాతం మరణాలే సంభవించాయి. అంటే టీకా తీసుకోవడం వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలు తగ్గుతున్నాయని.. అధ్యయనం చెబుతోంది.
  4. 677 మందిలో 71శాతం మందికి లక్షణాలు కన్పించగా.. 29శాతం మందికి ఏ లక్షణాలూ లేవు. లక్షణాలు ఉన్నవారు.. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు జలుబు, రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాస తీసుకోలేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకినా.. తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని గతంలో దిల్లీ ఎయిమ్స్ చేసిన అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్నాక కొవిడ్ వచ్చిన 63 మంది ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ నిపుణులు గమనించారు. వారిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక్కడోసు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారే.. మెుత్తంగా 53 మంది కొవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. రెండు డోసులు తీసుకున్నవారిలో 52.8 శాతం మంది, ఒక్క డోసు తీసుకున్నవారిలో 47.7 శాతం మంది ఇన్ ఫెక్షన్ కు గురయ్యారు. వీరికి  5 నుంచి 7 రోజులపాటు జ్వరం వచ్చినా.. తీవ్రస్థాయి అనారోగ్యం మాత్రం దరిచేరలేదని ఎయిమ్స్ నిపుణులు గతంలో గుర్తించారు. వ్యాక్సిన్ వేసుకోని వారితో పోల్చితే.. వేసుకున్న వారి పరిస్థితి సరిగా ఉందని ఎయిమ్స్ అధ్యయనంలో తెలిపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To ACB:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To ACB:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
KTR News: ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
Best Places for Sankranthi: ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
Embed widget