Corona Fourth Wave : 10 రోజుల్నించి క్రమంగా పెరుకున్న కరోనా కేసులు ! దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చేస్తోందా ?

ఏప్రిల్‌లో దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇది నాలుగో వేవ్‌కు సూచనలన్న అభిప్రాయాన్ని వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

FOLLOW US: 

దేశంలో కరోనా నాలుగోవేవ్ ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  దేశంలో ఈ నెలలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వైరస్ కేసులు పెరగాయి.  రోజుకు యాభై శాతం చొప్పున పెరుగుతున్నాయి.  పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది.  ఏప్రిల్ 13వ తేదీ అంటే  బుధవారం 4.34 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 1,007 మందికి వైరస్ సోకినట్లు తేలిందని కేంద్రం ప్రకటించింది. గత రోజు కంటే ఇవి ఏడు శాతం అధిక కేసులు. అయితే ఒక్క మరణం మాత్రమే నమోదయింది.   818 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.76 శాతం గా ఉంది. 

పెట్రోల్‌ సుంకం తగ్గిదాం సార్‌! పెట్రోలియం మినిస్ట్రీకి కేంద్రం చెప్పింది వింటే షాకే!!

దేశం వ్యాప్తంగా ఇప్పటి వరకూ 186 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.  దేశంలో ఎక్స్‌ఈ వేరియంట్ ప్రవేశించింది. అయితే ఈ వేరియంట్ ప్రభావం ఎంత అనేది ఇంకా తేలలేదు.  చైనా, యూఎస్‌లలో కోవిడ్ కొత్త వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్న కారణంగా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు రోజువారీగా పెరుగుతూండటంతో  ఐదు రాష్ట్రాలను కోవిడ్ నియంత్రణ చర్యలను తగ్గించవద్దని హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాల్లో రోజువారి పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. 

కోవిడ్ నియంత్రణ కోసం రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని నిరంతరం అనుసరించాల్సిన అవసరం ఉందని కేంద్రం ప్రకటించింది.   టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేష‌న్‌తోపాటు క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేయడం.. కోవిడ్ నియంత్రణకు ఐదంచెల వ్యూహాన్ని కొనసాగించాలని సూచించారు. కేంద్రం లేఖలు రాసిన వాటిలో.. కేరళ, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి.  తాజా గణాంకాలు దేశంలో జూన్​-జులై మధ్య కరోనా థార్డ్​ వేవ్​ రావచ్చన్న అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే చైనా సహా వివిధ దేశాల్లో కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్నాయి. 

ఒకే మ్యూజియంలో భారత ప్రధానుల చరిత్ర ! తొలి టిక్కెట్ కొని ప్రారంభించిన మోదీ

కరోనా కొత్త వేరియంట్ ఎక్‌ఈ ఎలా విస్తరిస్తుదంన్నదానిపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంత ప్రమాదకరమో గుర్తించలేదు. ఆ రకం వైరస్ భారత్‌లో వెలుగు చూడటంతో.. ఫోర్త్ వేవ్ వస్తుందన్న అంచనాల్లో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే ప్రభుత్వం కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం గా చేసింది.

Published at : 14 Apr 2022 07:11 PM (IST) Tags: Corona covid Corona Fourth Wave Corona Cases in April Rising Virus Cases

సంబంధిత కథనాలు

Omicron Variant BA.4 in Hyderabad:  హైదరాబాద్ వాసులకు అలర్ట్ -  కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు ఇక్కడే !

Omicron Variant BA.4 in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్ - కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు ఇక్కడే !

Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి

Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!

Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?

Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?

Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు

Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు