By: ABP Desam | Updated at : 09 Apr 2022 01:12 PM (IST)
గుజరాత్‌లో కరోనా కొత్త వేరియెంట్
ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ఎక్‌ఈ మొదటి కేసు శనివారం గుజరాత్‌లోని వడోదరోలో నమోదైంది. వడోదర వెళ్లిన ముంబయి వ్యక్తికి పరీక్షిస్తే పాజిటివ్ వచ్చింది.
భారతదేశంలో శనివారం 1,150 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేస్‌లు 11,365.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో బుధవారం ఓమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్ మొదటి కేసు నమోదైంది. వృత్తిరీత్యా కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్న 50 ఏళ్ల మహిళ ఈ వ్యాధి బారిన పడ్డట్టు అధికారులు తెలిపారు. ఆమె ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు వెల్లడించారు.
దీన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని ఖండించింది. మొదటి ఎక్స్‌ఈ సబ్-వేరియంట్ కేసు రిజిస్టర్ కాలేదని తేల్చింది. ఈ విషయాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఆ వ్యక్తి కోలుకున్నారని, ఆమెకో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లందరికీ నెగెటివ్ వచ్చినట్లు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే గురువారం తెలిపారు.
ఎక్స్‌ఈ వేరియంట్ BA.1, BA.2 ఓమిక్రాన్ జాతుల మ్యుటేషన్. దీనిని "రీకాంబినెంట్"గా సూచిస్తారు. భారతదేశంలో మూడో వేవ్‌లో ఆధిపత్యం వహించిన ఓమిక్రాన్ BA.2 సబ్-వేరియంట్ కంటే ఎక్స్‌ఈ వేరియంట్ 10 శాతం ఎక్కువ వ్యాప్తి ఉన్నట్టు కనిపిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
WHO ప్రకారం ఎక్స్‌ఈ రీకాంబినెంట్ వేరియంట్ మొదటిసారి యూకేలో జనవరి 19న గుర్తించారు. అప్పటి నుంచి 600 కేసులు బయటపడ్డాయి.
Covid 19: దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు- 18 మంది మృతి
Corona Cases: దేశంలో కొత్తగా 2వేలకు పైగా కేసులు- 17 మంది మృతి
COVID 19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 65 మంది మృతి
Omicron Variant BA.4 in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్ - కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు ఇక్కడే !
Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ