India Corona Rising : సోనియా, ప్రియాంకాలకే కాదు.. ఇంకా చాలా మందికి - మళ్లీ వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు !
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు 19 వేలు దాటాయి.
India Corona Rising : సోనియా, ప్రియాంకా గాంధీలకు కరోనా వైరస్ సోకిందన్న వార్త బయటకు వచ్చిన తర్వాత దేశంలో మళ్లీ కరోనా వైరస్‌పై చర్చ పెరిగింది. అంత వీఐపీలకే కరోనా సోకితే మిగతా వారి పరిస్థితేంటి అన్న చర్చ కూడా వచ్చింది. దానికి తగ్గట్లుగానే దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రియాశీల కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కేరళ, మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం కొత్త కేసులు, బాధితుల సంఖ్యపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ క్రియాశీల కేసులు 19 వేల మార్కు దాటాయి.
▪️India’s Cumulative COVID-19 Vaccination Coverage exceeds 193.70 Cr
— PIB India (@PIB_India) June 3, 2022
▪️Over 3.41 Cr 1st dose vaccines administered for age group 12-14 years
▪️India's active caseload currently stands at 19,509
Read here: https://t.co/mcYjWxDhgD #IndiaFightsCorona pic.twitter.com/88WvhSpjAq
శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు గురువారం 4.25 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 4,041 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ముందురోజు 3,712గా ఉన్న కొత్త కేసులు 300 పైగా పెరిగాయి. 84 రోజుల తర్వాత అత్యధిక కోవిడ్ కేసులు ఇప్పుడు నమోదయ్యాయి.! కోవిడ్ పాజిటివిటీ రేటు ఒకశాతానికి చేరువైంది. కేరళలో 1,370, మహారాష్ట్రలో 1,045 మంది కోవిడ్ వైరస్ బారినపడ్డారు. ఆ రెండు రాష్ట్రాల్లోనే రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం కోవిడ్ క్రియాశీల కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. నిన్న (గురువారం) 19 వేలకు పైగా ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య.. ఒక్కసారిగా 21,177 (0.05 శాతం) కు ఎగబాకింది. 24 గంటల వ్యవధిలో 2,363 మంది కరోనా నుండి కోలుకున్నారు. 10 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసులు 4.31 కోట్లకు పైగా ఉండగా.. అందులో రికవరీల వాటా 98.74 శాతంగా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోనే ఉంది. నిన్న (గురువారం) 12.05 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. ఇప్పటివరకూ 193 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం పేర్కొంది.
2nd phase of #HarGharDastak campaign in full swing as Healthcare workers vaccinate eligible population against #COVID at Jabalpur Railway Station. pic.twitter.com/CmDiDGQS5S
— Ministry of Health (@MoHFW_INDIA) June 3, 2022