News
News
X

Corona Vaccine Incentives: వ్యాక్సిన్ వేసుకో.. డైమండ్ వాచ్, అపార్ట్ మెంట్ తీసుకో!

ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవతం చేశాయి. ప్రజలు వ్యాక్సిన్ కోసం రాకరోయే సరికి చాలా దేశాలు డైమండ్ వాచ్, బంగారం, టెస్లా కారు, అపార్ట్​మెంట్​ల వంటి ఖరీదైన బహుమతులను అందిస్తున్నాయి.

FOLLOW US: 

ప్రపంచ దేశాల్లో కరోనా డెల్టా వేరియంట్ (Delta Variant) వేగంగా వ్యాప్తి చెందుతోంది. బ్రిటన్ సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు టీకాలు వేయించుకోవాలని ఆయా దేశ ప్రభుత్వాలు కోరుతున్నాయి. కొవిడ్‌ కట్టడిలో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. టీకా తీసుకున్న వారికోసం కొద్ది నెలలుగా భారీగా బహుమతులనూ అందిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉచితంగా గేమింగ్‌ టికెట్లు, ఆహార పదార్థాలు, బీరు వంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

మరికొన్ని దేశాల్లో ఏకంగా విలాసవంతమైన భవనాల వంటి ఖరీదైన బహుమతులనూ అందజేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయినా కొన్ని దేశాల్లో ప్రజలు టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి అందరికీ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వాలు ప్రకటిస్తున్న బహుమతుల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది.

వ్యాక్సిన్ వేసుకుంటే అపార్ట్ మెంట్..

వ్యాక్సిన్‌ తీసుకున్న తమ పౌరులకు లాటరీ పద్ధతిలో తుపాకులు, వాహనాలు, నగదును బహుమతిగా అందించేందుకు కొద్ది వారాల క్రితం అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో అధికార యంత్రాంగం నిర్ణయించింది. జూన్‌ 20న నుంచి ఆగస్టు 4 వరకు అమలులో ఉండనున్న ఈ లాటరీ వివరాలను ఇటీవల వెస్ట్‌ వర్జీనియా గవర్నర్‌ జిమ్‌ జస్టిస్‌ వెల్లడించారు. కానీ ఇటీవల ఈ ప్రోత్సాహకాల స్థాయి మరింత పెరిగింది. ఇక హాంకాంగ్‌లో ప్రకటిస్తున్న బహుమతులను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ దేశంలో వ్యాక్సిన్‌ తీసుకున్న పౌరులు ఏకంగా టెస్లా కారు లేదా ఓ కొత్త అపార్ట్‌మెంట్‌కు యజమాని కావచ్చు. టీకా తీసుకున్నవారికోసం బంగారం, ఖరీదైన రోలెక్స్‌ చేతి గడియారాలు, షాపింగ్‌ వోచర్లను కూడా అక్కడి సర్కారు సిద్ధం చేసింది. ఇక రష్యా.. శీతల ప్రదేశాల్లో నివసించే తమ ప్రజల కోసం మంచులో ప్రయాణించే వాహనాలను ప్రోత్సాహకాలుగా అందిస్తోంది.

నిరాసక్తతే..

అయితే ఈ ప్రోత్సాహకాలతో ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్‌ పెరిగిందా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లభించడంలేదు. ఒహియోలో భారీ లాటరీని ఏర్పాటు చేసినా అక్కడ టీకా తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు రాకపోవడమే ఇందుకు నిదర్శనం. కానీ హాంకాంగ్‌లో ప్రైవేటు రంగం ఆఫర్లను ప్రకటించిన తర్వాత అక్కడ గత ఏడు వారాల్లో టీకా తీసుకున్న వారి సంఖ్య రెట్టింపు అయినట్లు ఓ వార్తా సంస్థ నిర్వహంచిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను పెంచడంలో భాగంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలతో పాటు ఇలాంటి బహుమతులు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు.

Published at : 27 Jul 2021 01:14 PM (IST) Tags: Corona corona vaccine corona cases corona today Diamond watches apartments

సంబంధిత కథనాలు

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే

Ghee Side Effects: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యికి దూరంగా ఉండాల్సిందే

Ghee Side Effects: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యికి దూరంగా ఉండాల్సిందే

టాప్ స్టోరీస్

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు