Constipation Heart Problems: మలబద్దకం వల్ల గుండెపోటు వస్తుందా? ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమే!
Constipation Heart Problems: మలబద్దకం చిన్న విషయమే అనిపించవచ్చు. క్రమరహిత పేగు కదలికలు అసౌకర్యానికి గురిచేస్తాయి. దీర్ఘకాలిక మలబద్దకం గుండె సమస్యలకు కారణం అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Constipation Heart Problems: నేటికాలంలో గుండెసంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. గుండె పోటుకు కారణాలు ఎన్నో కావచ్చు. ముఖ్యంగా జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కూడా గుండెజబ్బుకు కారణం అవుతున్నాయి. ఇందులో భాగంగా పేగు కదలికల్లో మార్పులు కూడా ఒకటి. జీర్ణ వ్యవస్థ బయట పేగు కదలిక, ప్రధాన వాస్కులర్, నాన్ వాస్కులర్ వ్యాధుల మధ్య అనుబందాలను పలువురు పరిశోధకులు పరిశీలించారు. పరిశోధన, వాటి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్దకం, గుండె సమస్యలు:
మలబద్దకం చిన్న విషయమే కావచ్చు. అయినప్పటికీ దాని పర్యవసనాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. క్రమరహిత పేగు కదలికలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. దీర్ఘకాలిక మలబద్దకం గుండె సమస్యల ప్రమాదానికి కారణమవుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. గట్, హృదయనాళ వ్యవస్థ మధ్య సంక్లిష్టమైన నెట్‌వర్క్‌లో క్లిష్టమైన లింక్ ఉంది. దీర్ఘకాలిక మంట, మలబద్దకం, గుండె సమస్యలు ఒకదానికొకటి ముడిపడిఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా మలబద్దకం అనేది శరీరంలో టాక్సిన్స్ నిర్మాణానికి దారి తీస్తుంది. చెడు మలినాలన్నీ కడుపులోనే పేరుకుపోవడంతో గుండెనాడి వ్యవస్థను ప్రభావితం చేసి వాపునకు కారణం అవుతుంది. నిశ్చల జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు..ఇవన్నీ కూడా ప్రమాద కారకాలను ప్రేరేపిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం అనేది గుండె సంబంధిత వ్యాధులకు దగ్గరి సంబంధం కలిగి ఉందని పరిశోధనలో తేలింది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు మలబద్దకంతో బాధపడుతున్న విషయాన్ని పరిశోధనలో గమనించారు.
మలబద్దకం కారణంగా అధిక రక్తపోటు, రక్తప్రసరణలో ఆటంకం, గుండె వైఫల్యం, అరిథ్మియా, తీవ్రమైన కరోనరి డీసీజ్, వంటి గుండె సంబంధిత సమస్యలు తీవ్రం అవుతాయి. కొన్నిసార్లు పెద్దపేగులో గ్యాస్ ఛాతీకి వ్యాపించి గుండెనొప్పికి కారణం అవుతుంది.
గుండె ఆరోగ్యం బాగుండాలంటే:
తృణధాన్యాలు,పండ్లు, కూరగాయలు:
మన శరీరంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకవాలి. ఫైబర్ తోపాటు నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫైబర్ , నీళ్లు ఈ రెండూ కూడా మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
మలాన్ని మృదువుగా చేయడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి హైడ్రేటెడ్ గా ఉండండి:
మీ శరీరానికి కావాల్సిన నీరు అందించింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతోపాటు నీరు చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగుతే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా దీని ప్రభావం జీర్ణక్రియపై పడుతుంది.
ఆరోగ్యకరమైన గట్ కోసం మీ ఆహారంలో ప్రోబయోటిక్స్‌ని చేర్చుకోండి :
గట్ ఆరోగ్యం బాగుండాలంటే ప్రొబయెటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి. మీ గట్ ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య గట్ మైక్రోబయోమ్ అవసరం.
పేగు కదలికలు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనండి:
వ్యాయామం మన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన నిరోధక వ్యవస్థను కాపాడటంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also Read : మీ స్కిన్ టోన్ డార్క్ అవుతోందా? ఈ ఇంటి చిట్కాలతో టాన్ రిమూవ్ చేసేయొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.