అన్వేషించండి

Curry Leaves Health Benefits: కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా….వీటిలో ఎన్ని పోషకాలున్నాయో తెలుసా….!

కూరలో కరివేపాకులా తీసిపడేశారంటారు…కానీ కరివేపాకు తింటే కూరకన్నా ఎక్కువ ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా….ఏవో అటకబుర్లు కాదండోయ్...స్వయంగా న్యూట్రీషియన్లు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోతారు…

కరివేపాకు అంటే తెలియని వారుండరు. ఎందుకంటే భారతీయ వంటకాల్లో కరివేపాకు ఉపయోగించకుండా చేసే వంటలు చాలా చాలా తక్కువ. వీటిలో  ఉండే తాజా సువాసన, కమ్మని రుచి వంటల రుచిని మరింత పెంచుతాయి.అయితే రుచి మాత్రమే కాదు…వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా…ఏదో ఆ నోటా ఈనోటా చెప్పుకున్న మాటలు కాదు…స్వయంగా న్యూట్రిషియన్లే చెబుతున్నారు.

కరివేపాకు చూడటానికి వేప ఆకులా ఉంటుంది. అందుకే వీటిని స్వీట్ నీమ్ అనికూడా అంటారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ , వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ డయాబెటిక్ , యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలతో పాటు, హిపటో ప్రొటెక్టివ్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల, లివర్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పించే సామర్థ్యం ఇందులో ఉంది.


Curry Leaves Health Benefits: కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా….వీటిలో ఎన్ని పోషకాలున్నాయో తెలుసా….!

కరివేపాకువల్ల ప్రయోజనాలేంటంటే…

  • కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ యూరిన్, బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది
  • కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు తగ్గుతాయి.
  • కరివేపాకులో యాంటీహైపర్ గ్లిసమిక్ నేచరల్ కలిగి ఉండటం వల్ల , ప్రధానమైన రక్త నాళాల్లో గ్లోకోజ్ ను కంట్రోల్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరిచి, కొలెస్ట్రాల్ సమస్యను అంతం చేస్తుంది కరివేపాకు
  • వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే చిన్న చిన్న జబ్బులను నివారించడంలో కరివేపాకు సహాయపడుతుంది.
  • గర్భిణీలు మార్నింగ్ సిక్ నెస్, వాంతులు, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి సంబంధిత రోగాలు దరిచేరవు
  • కరివేపాకు పేస్టును టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
  • కరివేపాకు మెదడుతో సహా నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
  • చర్మ సంరక్షణ కోసం…కరివేపాకు-వేపాకులు సమానంగా తీసుకుని ముద్దగా నూరి రోజూ రెండుపూటలా  టీ స్పూన్ పేస్టుని అరకప్పు మజ్జిగతో కలపి తీసుకుంటే చర్మ సంబంధ సమస్యలు తీరిపోతాయి.
  • కరివేపాకు పేస్ట్ కు కొద్దిగా పసుపు చేర్చి చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్స్ తగ్గుతాయి
  • ఆరోగ్యకరమైన జుట్టుకి కరివేపాకు మంచి రెమెడీ..
  • కరివేపాకులోఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.


Curry Leaves Health Benefits: కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా….వీటిలో ఎన్ని పోషకాలున్నాయో తెలుసా….!

ఆహారంలో రోజూ కరివేపాకుని భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. కరివేపాకుతో పాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది  ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇది పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న గ్రాండ్ మదర్స్ చిట్కా.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget