ఒక్క నిమిషం వ్యాయామం చేస్తే, చావు త్వరగా రాదట - ఈ వ్యాధులన్నీ పరార్!
యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన సైంటిస్టులు 60సెకన్ల వ్యాయామం చేయడంపై పరిశోధనలు చేశారు. గంటల పాటు వ్యాయామం చేయడం కన్న కేవలం 60సెకన్ల వ్యాయామం చేయడం వల్లే ఎక్కువ ఉపయోగం ఉందని నిర్ధారించారు.
ఆరోగ్యం బాగుండాలంటే ఎవరైనా సరే రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ విషయం ఎవర్ని అడిగినా చెబుతారు. వైద్యులు అయితే ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు. వ్యాయామం చేయడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గుతారు. అలాగే డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయన్న విషయాలను వైద్య నిపుణులు ఇప్పటికే చాలాసార్లు తెలిపారు. తాజాగా సైంటిస్టులు.. మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ప్రతి రోజూ కేవలం ఒక్క నిమిషం వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
60 సెకన్ల వ్యాయామంతో ఎంతో మేలు
యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన సైంటిస్టులు 60సెకన్ల వ్యాయామం చేయడంపై పరిశోధనలు చేశారు. గంటల పాటు వ్యాయామం చేయడం కన్న కేవలం 60 సెకన్ల వ్యాయామం చేయడం వల్లే ఎక్కువ ఉపయోగం ఉందని నిర్ధారించారు. రోజుకు కేవలం 60 సెకన్ల వ్యాయామం చేయడం వల్ల.. ఉపిరితితుల్లో సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. అంతేకాదు.. గుండె సంబంధిత వ్యాధులకు సైతం చెక్ పెట్టవచ్చని తెలిపారు. మరీ ముఖ్యంగా పెద్ద వయస్సు వాళ్లు ప్రతిరోజూ కేవలం 60 సెకన్ల పాటు కాస్తంత వ్యాయామం చేస్తే.. వాళ్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుందని తెలిపారు. ఈ పరిశోధనలు చేసేందుకు కొంతమంది పెద్ద వయస్సు వాళ్లతో రోజుకు 60సెకన్లు వ్యాయామం చేసి, రిపోర్ట్‌ను తయారు చేశారు సైంటిస్టులు.
షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు
ముందుగా అధ్యయనంలో పాల్గొన్న వారికి ఏడు రోజుల పాటు స్మార్ట్ వాచీలు ధరించి, రోజుకు వారితో 60 సెకన్ల వ్యాయామం చేయించారు. ఈ వ్యాయామం ముందు ఆ తర్వాత వారి యొక్క హెల్త్ కండీషన్ పరిశీలించారు. ఇలా చాలా ఏళ్ల పాటు నిర్వహించిన పరిశోధనలో.. మరణించే ప్రమాదం 40 శాతం తక్కువగా ఉందని నిపుణులు కనుగొన్నారు. ఈ చిన్నపాటి వ్యాయామంతో అనేక అడ్డంకులను అధిగమించిగలిగారని తెలిపారు. అంతేకాదు.. శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి ఈ వ్యాయామం తోడ్పడిందని తెలిపారు. అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చని వెల్లడించారు.
విద్యార్థులు వ్యాయామం చేయడం వల్ల ఉపయోగాలు
కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన కొంతమంది సైంటిస్టులు స్టూడెంట్స్‌పై పరిశోధనలు చేశారు. ఉదయాన్నే లేచి, స్కూల్‌కు రెడీ అయ్యేందుకు ఇష్టపడని, కొంత స్టూడెంట్స్‌పై ఈ పరిశోధన చేశారు. మరీ ముఖ్యంగా టీనేజిలో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజూ కాస్తంత వ్యాయామం చేస్తే.. వాళ్లకు సైన్సులో మంచి మార్కులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. వ్యాయామం చేస్తే, వాళ్ల పరీక్ష ఫలితాల్లో అంత ఎక్కువ ప్రభావం ఉంటోందని పరిశోధకులు తెలిపారు. 5 వేల మంది పిల్లల మీద ఈ పరిశోధన చేసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధరించుకున్నారు. ఏ సబ్జెక్ట్ అయితే ఏ స్టూడెంట్‌కు ఇష్టం ఉండదో.. అదే సబ్జెక్ట్‌లో మంచి మార్కులు సాధించిన్నట్లు వెల్లడించారు. యాక్సెలరోమీటర్ అనే పరికరాన్ని వారికి అమర్చి మూడునుంచి ఎనిమిది రోజుల వరకు వారి వ్యాయామాల తీరును లెక్కించారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు సబ్జెక్టులలో వారికి వచ్చిన మార్కులు చూడగా.. సైన్సు మార్కులలో మంచి మెరుగుదల కనిపించింది. అందులోనూ అమ్మాయిలకు ఈ మార్కుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.