Fact Check: వర్షంలో సెల్‌ఫోన్ మాట్లాడితే చనిపోతామా? ఆ వీడియోలో నిజమెంత?
వర్షంలో సెల్‌ఫోన్ మాట్లాడటానికి, పిడుగులు పడటానికి సంబంధం ఏంటి..? భౌతిక శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు..?
Cell Phone in Rain: ప్రస్తుతం చేతిలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఎవరూ ఊహించలేరు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు చేతిలో ఫోన్, ఆ పోన్‌కి వైఫై లేదా హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే ఊపిరి ఆగిపోయినట్టవుతుంది. అన్నం లేకపోయినా ఉండగలుగుతాం కానీ, ఫోన్ లేకపోయినా దానికి నెట్ లేకపోతే అస్సలు క్షణం గడవని పరిస్థితి నేటి ప్రపంచానిది. పక్కన మనిషి ఉన్నా లేకపోయినా బేఫికర్, ఫోన్‌కి హైస్పీడ్ నెట్, మాట్లాడుకోవడానికి ఫుల్ సిగ్నల్, బ్యాలెన్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటే చాలు. ఈ లోకంతో పనిలేదు. సరే ఇవన్నీ ఇప్పుడెందుకంటారా.. అసలు మేటర్‌లోకి వెళ్దాం..
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి జోరున వానలో చెట్టుకింద బైకుపై కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా పిడుగు పడి చనిపోతాడు. అప్పట్నుంచి ఈ వీడియోను చూపించి వర్షంలో ఫోన్ మాట్లాడకూడదంటూ సోషల్ మీడియా హెచ్చరికలు, జాగ్రత్తలతో కూడిన సందేశాలు విపరీతంగా వస్తున్నాయి. అసలు నిజంగా వర్షంలో సెల్‌ఫోన్ మాట్లాడితే చనిపోతామా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
వర్షంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడడం నివారిద్ధాం.
— B Vinod Kumar (@vinodboianpalli) July 24, 2024
- మీ బోయినపల్లి వినోద్ కుమార్. pic.twitter.com/NyA2PwPYvt
ఆ సమయంలో మీ సెల్ ఫోన్ వాల్ అవుట్‌లెట్‌కి ప్లగిన్ చేయబడితే తప్ప ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మెరుపులకు ఫోన్ అంటే ఏమిటి, ఫోన్ కాల్ అంటే ఏమిటి అనే భావన లేదు. మెరుపు అనేది ఒక విద్యుత్ స్పార్క్, గాలి అది ప్రయాణించే మాధ్యమంగా ఉంటుంది. వర్షాల సమయంలో మేఘాలు, భూమి మధ్య విద్యుత్ వ్యత్యాసాన్ని సమం చేయడానికి ఈ మెరుపులు సంభవిస్తాయి. ఒకవేళ ఎవరైనా సెల్‌ఫోన్ కారణంగా పిడుగు పడి చనిపోతే చేతిలో ఉన్న మొబైల్ కరిగిపోవడమో, కాలిపోవడమో అవుతుంది. ఒకవేళ చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటం వలన ఇంటికి ఉన్న ఎర్తింగ్ సమస్య కారణంగా ప్రమాదం సంభవిస్తుంది. కాకపోతే వర్షం సమయంలో ఈ షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రమాదం సంభవించే అవకాశాలు ఇంకొచంఎం ఎక్కువగా ఉంటాయి. ఆ కారణం చేతనే వర్షాకాలంలో ల్యాండ్ లైన్ ఫోన్లను వినియోగించే సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండేవి. దీనికి కూడా ఎర్తింగ్ సమస్యలే కారణం.
ఆ టెలిఫోన్ వైర్ మీ ఇంటిలో లేదా టెలిఫోన్ కంపెనీ సెంట్రల్ ఆఫీస్‌లో ఏదో ఒక గ్రౌండెడ్ సర్క్యూట్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.
మెరుపులను, పిడుగులను ఏవీ ఆకర్షించలేవు, అవి వైర్లను, కంచెలను ఫాలో అవుతాయి. సెల్ ఫోన్‌లో మాట్లాడని వ్యక్తి మీద పిడుగు పడటానికి ఎంత ప్రమాదం ఉందో, మాట్లాడే వ్యక్తి మీద పిడుగు పడటానికి కూడా అంతే అవకాశం ఉంది. అయితే
చెట్టుకింద ఉండటం వలనే పిడుగుపాటు
వాతావరణంలో ఉష్టోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా పిడుగులు సంభవిస్తాయి. సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. అయితే, ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే 'పిడుగు పడటం' అంటారని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న నిపుణులు హరి కిరణ్ వివరించారు. అయితే దానిని వాటిని ఆకర్షించే లక్షణం పచ్చని చెట్లకు ఎక్కువగా ఉంటుంది. అందువలనే మనం వీడియో చూసిన వ్యక్తి చెట్టుకింద ఉండటం వలన పిడుగుపాటుకు గురయ్యాడు తప్ప, సెల్‌పోన్ మాట్లాడటం వలన మాత్రం కాదని భౌతిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.